స్మితా సబర్వాల్ వివాదంలో షాకింగ్ ట్విస్ట్!!

సివిల్ సర్వీసెస్ దివ్యాంగుల కోటపై సీనియర్ ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మిత సబర్వాల్ చేసిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్మిత సబర్వాల్ చేసిన ట్వీట్ ల పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వర్షం కురుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు కూడా స్మితా సబర్వాల్ దివ్యాంగులను అవమానించే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

స్మితా సబర్వాల్ కు మద్దతు
ఆమె తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే స్మిత సబర్వాల్ చేసిన ట్వీట్ లో తప్పేముంది అని చాలామంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు. చాలామంది స్మిత సబర్వాల్ చేసిన ట్వీట్ కూ తమ మద్దతును తెలుపుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాల్సిన చోట దివ్యాంగులు కాస్త ఇబ్బందులకు గురవుతారని అంటున్నారు.

Shocking twist deputy cm bhatti vikramarka support to Smita Sabharwal

ఐఏఎస్ లో దివ్యాంగుల కోట దేనికని ప్రశ్నిస్తున్న స్మితా సబర్వాల్ మద్దతుదారులు
అన్ని అంగాలు సరిగా ఉండి బాగా చదువుకుని ఉద్యోగాలు లేకుండా బాధ పడుతున్న ఎంతో మంది యువత ఉన్నారని, వారికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఒక్కోసారి ఐఏఎస్ అధికారులు ఉరుకులు పరుగులతో పనులు చేయాల్సి ఉంటుందని అలాంటి సమయంలో దివ్యాంగులు వేగంగా పనిచేయడానికి ఇబ్బంది పడతారని ఐఏఎస్ లో నిజంగానే దివ్యాంగుల కోట దేనికని కొందరు ప్రశ్నిస్తున్నారు.

స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై భట్టి వ్యాఖ్యలు
స్మిత సబర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడంలో తప్పేముందని అడుగుతున్న వారు కూడా లేకపోలేదు. ఇక తాజాగా స్మిత సబర్వాల్ చేసిన ట్వీట్ ల పైన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఈ మేరకు చిట్ చాట్ చేసిన భట్టి విక్రమార్క స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.

Shocking twist deputy cm bhatti vikramarka support to Smita Sabharwal

ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది
స్మిత సబర్వాల్ ఐఏఎస్ అధికారిణి అని సోషల్ మీడియాలో ఆమెకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.స్మితా సబర్వాల్ దివ్యాంగుల కోట పైన తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారని, అందులో ప్రభుత్వ ప్రమేయం గురించి చర్చించలేదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పటికే మంత్రి సీతక్క తదితరులు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మద్దతు తెలపడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+