తుపాకితో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య: కారణం తెలియదన్న ఎస్పీ
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పోలీస్ క్వార్టర్స్ లో ఎస్సై జగన్మోహన్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఎనిమిది నెలలకే బదిలీ చేశారని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం జగన్‌మోహన్ మృతదేహాన్నిబంధువులకు అప్పగించారు.
ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్, ఓఎస్‌డీ సుబ్బారాయుడు పరిశీలించారు. సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. అందులో ఏము న్నదో బయటికి తెలియలేదు. పోలీసులు దాన్ని బయటపెట్టడం లేదు. కరీంనగర్ మండలం చర్లభూత్కూర్‌కు చెందిన జగన్‌మోహన్ 2007లో పోలీసుశాఖలో ఎస్సైగా చేరాడు.

ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, నర్సాపూర్(జీ) ఎస్సైగా పని చేసిన తర్వాత కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎస్సైగా జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో పనిచేశాడు. 2015 జనవరి 14న పెద్దపల్లి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 4న పెద్దపల్లి నుంచి రిలీవ్ అయిన జగన్‌మోహన్ జమ్మికుంటలో విధుల్లో చేరాల్సి ఉంది. పెద్దపల్లి ఎస్సైగా వచ్చినప్పటి నుంచి పోలీస్‌స్టేషన్ పక్కన ఉన్న పోలీస్ క్వార్టర్‌లోనే నివాసం ఉంటున్నాడు. బదిలీ అయిన ప్పటికీ పెద్దపల్లిలోనే ఉంటున్నాడు.
శుక్రవారం రాత్రి సర్వీస్ తూపాకీతో పాయిం ట్ బ్లాక్‌లో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై జగన్‌మోహన్ భార్య జ్యోతి ఇంట్లో ఉన్న సమయంలోనే మూడు గంటల పాటు ఇంటి ముందు కూర్చుని ఓ మిత్రుడితో మూడు గంటల పాటు మాట్లాడినట్లు సమాచారం. అతను వెళ్లిపోగానే కొద్ది క్షణాల్లోనే తుపాకీతో కాల్చుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మికుంట ఎస్‌ఐ జగన్‌మోహన్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి అయింది. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జోయల్ డేవిడ్ పరిశీలించారు. ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని ఆయన అన్నారు. సుసైడ్ నోట్‌ను రెవెన్యూ అధికారులకు అప్పగించామని చెప్పారు.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications