వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుర్భర స్థితిలో సింగరేణి బతుకులు: వారేమో విహార యాత్రల్లా విదేశీ పర్యటనలు

రెండేళ్లకోసారి విదేశీ పర్యటనలు.. ప్రతిసారీ పర్యటనల పేరుతో రూ.కోటి ఖర్చు.. విదేశాల్లోని బొగ్గు గనుల్లో అమలు చేసే సౌకర్యాలు, రక్షణ చర్యలపై అధ్యయనం పేరుతో సందర్శనలు..

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: రెండేళ్లకోసారి విదేశీ పర్యటనలు.. ప్రతిసారీ పర్యటనల పేరుతో రూ.కోటి ఖర్చు.. విదేశాల్లోని బొగ్గు గనుల్లో అమలు చేసే సౌకర్యాలు, రక్షణ చర్యలపై అధ్యయనం పేరుతో సందర్శనలు.. అక్కడ కార్మికులు అనుభవిస్తున్న హక్కులు, యాజమాన్యాలు కల్పిస్తున్న సౌకర్యాలు అధ్యయనం చేసేందుకు వెళ్తున్న కార్మిక సంఘాల నేతలు కనీసం కొద్దిలో కొంతైనా సింగరేణిలో అమలు చేయించడంలో శ్రద్ధ చూపడం లేదు. సింగరేణిలో పని చేసే కార్మికులకు విదేశీ బొగ్గు గనుల తరహా సౌకర్యాలను అమలు చేయించాలన్న కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు.

అక్కడి పరిస్థితులను స్వయంగా సందర్శించిన కార్మిక సంఘాలు కేవలం విహార యాత్రల మాదిరిగా పర్యటిస్తున్నారే తప్ప ఇప్పటివరకు అక్కడి విధానాల్లో ఒక్కటి కూడా అమలు చేయించలేకపోయారు. దక్షిణాఫ్రికా గనుల్లో పని చేసే కార్మికులకు ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ లలోస్టార్‌ హోటల్‌ను మరిపించే విధంగా సౌకర్యాలున్నాయి.

కష్టపడి వచ్చే కార్మికులకు అల్పాహారం అందించే క్యాంటీన్‌లలో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారు. గనుల్లోకి దిగి పని చేసే కార్మికులకు అక్కడి యాజమాన్యాలు కల్పిస్తున్న సౌకర్యం చూస్తే ఏ నక్షత్ర హోటల్‌లో భోజనం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. శుచి శుభ్రతకు అక్కడి క్యాంటీన్‌లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇలా క్యూ కట్టాలి...

ఇలా క్యూ కట్టాలి...

సింగరేణి యాజమాన్యం నిర్వహించే క్యాంటీన్‌లలో కార్మికులు అల్పాహారం కోసం క్యూ కట్టి పదార్థాలు తీసుకోవాలి. బెంచీపై కూర్చొని దానికే అమర్చిన బల్లలపై ఆరగించాలి. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం మరోసారి మాత్రమే కార్మికులకు అల్పాహారం అందుబాటులో ఉంటుంది. అందులోనూ నాణ్యమైన ఆహారం అంతంత మాత్రమే. ఇక శుచి శుభ్రత విషయానికి వస్తే ఎక్కడా అంతగా పాటించిన దాఖలాలు కనిపించవు.

ఐదు సార్లు సందర్శించారు...

ఐదు సార్లు సందర్శించారు...

గడిచిన పదేళ్ల కాలంలో ఇప్పటివరకు అయిదు సార్లు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో పాటు అధికారులు విదేశాల్లోని బొగ్గుగనులను సందర్శించారు. పర్యటన చేసిన ప్రతిసారీ రూ.కోటి వరకు సింగరేణి ఖర్చు చేస్తోంది. రెండేళ్లకోసారి మిగతా2లో..బొగ్గు గనులున్న చైనా, దక్షిణాఫ్రికా, పోలండ్‌, మెజాంబిక్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లో పర్యటించారు. పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ పది మంది సభ్యుల బృందం విదేశాల్లోని బొగ్గు గనుల్లో చేపట్టే ఉత్పత్తి విధానంతో పాటు అక్కడ కార్మికుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, కార్మికుల భద్రత, రక్షణ చర్యలు, వైద్యం వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు. కాని ఇప్పటివరకు ఆ దిశగా కార్మిక నేతలు చేపట్టిన చర్యలు శూన్యం.

ఇదీ చిత్తశుద్ధి...

ఇదీ చిత్తశుద్ధి...

..ఇదీ మన కార్మికుల సంక్షేమంపై సింగరేణి యాజమాన్యం చిత్తశుద్ధి. ఈ విషయంలో కార్మిక సంఘాలు కనీస చర్చలు కూడా చేపట్టకపోవడంతో వందేళ్ల కిందట ఉన్న వసతులే ఇప్పటికీ కనిపిస్తున్నాయి. సింగరేణిలో క్యాంటీన్‌ వ్యవస్థ మొదలైనప్పటి నుంచి ఉన్న భవనాలే ఇంకా కొనసాగుతున్నాయి. 50 ఏళ్ల క్రితం నిర్మించిన క్యాంటీన్‌లలోనే కార్మికులు అల్పహారం తింటున్నారు. గతంలో నిర్మించిన ట్యాంకుల నుంచి వచ్చిన నీటినే తాగుతున్నారు. కనీసం వాటిని శుభ్రం చేసింది కూడా తక్కువే. ఇక నాణ్యమైన వంటకాలంటే ఉన్న బడ్జెట్‌లో సర్దుకుని కార్మికులకు వడ్డించాల్సిన పరిస్థితి. కనీసం కార్మికులకు అందించే అల్పాహారం బడ్జెట్‌ను కూడా పెంచకపోవడంతో యూనిట్‌లు సరిపోవడం లేదు. కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉంటే కొన్ని గనుల్లో చివరి వారికి అల్పాహారం అందని పరిస్థితి.

ఇలా చేయాలి కానీ...

ఇలా చేయాలి కానీ...

భూగర్భ గని పొరలు కూలిపోకుండా ఇనుప కడ్డీలను చుట్టూ అమర్చడంతో పాటు దాని లోపల జాలిని ఏర్పాటు చెయ్యాలి. . ఎట్టి పరిస్థితుల్లో పైకప్పు కూలిపోవడానికి ఆస్కారం ఉండదు. పోలండ్‌లోని భూగర్భ బొగ్గుగనులను మన కార్మిక సంఘాల ప్రతినిధులతో పాటు అధికారుల బృందం కూడా సందర్శించింది. మన సింగరేణిలోని పైకప్పునకు ఎలాంటి ఆసరా లేదు. కేవలం రూఫ్‌బోల్టులపైనే ఆధారపడి ఉండాలి. ఇది ఎక్కడో పని స్థలంలో కాదు. జంక్షన్‌ ఉన్న ప్రాంతంలోనే ఈ పరిస్థితి. పైకప్పునకు చుట్టూ విదేశీ తరహా ఎలాంటి ఇనుప కడ్డీలు అమర్చరు. చుట్టూ ఇనుప జాలిని కూడా ఏర్పాటు చేయరు.ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. సింగరేణి భూగర్భ బొగ్గుగనుల్లో ఇదే పరిస్థితి. అందుకే ఇక్కడ ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉంది.

రక్షణ చర్యలపై నిర్లక్ష్యం....

రక్షణ చర్యలపై నిర్లక్ష్యం....

సింగరేణి భూగర్భ బొగ్గు గనుల్లో రక్షణ చర్యలపై యాజమాన్యం ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గనుల్లో పని చేసే కార్మికులకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. కార్మికుల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటామని యాజమాన్యం ప్రచారం చేసుకుంటుంది. కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తారు. విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితిని వివరించడమే కాని అదే తరహాలో సింగరేణిలోనూ అమలు చేయాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చిన సంఘాలు లేవు. విదేశీ గనుల్లో ప్రమాదం జరిగి కార్మికుడు మృతి చెందితే ఆ గనిని మూసివేసే చట్టం అక్కడ అమలవుతోంది. అదే విధంగా సంబంధిత గని బాధ్యులపై జైలు శిక్షలు అమలు చేస్తున్నట్లు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన కార్మిక సంఘాల నాయకులే వెల్లడించారు. కానీ ఇక్కడ మాత్రం కార్మికుల భద్రతను గాలికి వదిలేసి బొగ్గు ఉత్పత్తిపైనే దృష్టి సారిస్తున్న యాజమాన్యంపై మాత్రం ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు.

ఇరుకు ఇరుకుగా..

ఇరుకు ఇరుకుగా..

పోలండ్‌లోని భూగర్భ బొగ్గుగనుల్లో,కార్మికులు మ్యాన్‌రైడింగ్‌ ద్వారా ఉపరితలానికి చేరుకోవడానికి ఏర్పాటు చేసిన జంక్షన్‌ విశాలంగా ఉన్న ప్రాంతంలో మ్యాన్‌రైడింగ్‌ వరకు చేరుకుని కార్మికులు అందులో ఎక్కి ఉపరితలానికి చేరుకుంటారు. అయితే ఆ ప్రాంతం విశాలంగా ఉండటంతో పాటు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఇరుకుగా ఉన్న ప్రాంతంలో మ్యాన్‌రైడింగ్‌ జంక్షన్‌ ఏర్పాటు చేస్తారు. కార్మికులు దానిలోకి ఎక్కాలంటే ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ రావాల్సిందే. విశాలమైన ప్రాంతం ఏర్పాటు చేయకపోవడంతో కార్మికులు అసౌకర్యంగానే ఇక్కడికి చేరుకుంటారు.

దుర్భర పరిస్థితిలో...

దుర్భర పరిస్థితిలో...

సింగరేణి గనుల్లో పని చేసే కార్మికులకు నిత్యం అసౌకర్యాల మధ్యనే జీవితం గడుపుతున్నారు. కనీస వసతులు లేని ప్రాంతాల్లో పనులు చేయాల్సి వస్తోంది. బొగ్గు ఉత్పత్తి చేసే పని స్థలాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండవు. పని చేసి విశ్రాంతి తీసుకోవడానికి కూడా అక్కడ సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఉండదు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కార్మిక సంఘాలు కనీసం విదేశాల్లో కార్మికులకు అమలు చేస్తున్న సౌకర్యాలు, విశాలమైన గులాయిలు, పని స్థలాల్లో గాలీ.. నీరు సౌకర్యాలు కల్పించాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించడం లేదు. ఈ ఎన్నికల ద్వారానైన సింగరేణి గనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం, సౌకర్యాలపై చర్యలు తీసుకోవడానికి సంఘాలు ఒత్తిడి తెస్తాయని కార్మికులు ఆశిస్తున్నారు.

English summary
The Trade unions failed to solve the problems of Singereni workers spread in the district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X