నేను గజల్ శ్రీనివాస్‌ను కాను: మీడియాపై సింగర్ శ్రీనివాస్ ఫైర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసు వార్తాకథనంలో తన ఫొటోను ప్రచురించిన ఓ న్యూస్ వెబ్‌సైట్‌పై గాయకుడు, వ్యాఖ్యాత శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గజల్ శ్రీనివాస్ అలియాస్ కేశిరాజు శ్రీనివాస్ ఫొటో బదులు తన ఫొటో పెట్టడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ఓ జాతీయ స్థాయి మీడియా సంస్థ నిర్వహిస్తున్న న్యూస్ వెబ్‌సైట్ ఆ ఫొటోను ప్రచురించింది.

ఆ శీర్షికతో వార్తాకథనం..

ఆ శీర్షికతో వార్తాకథనం..

గిన్నిస్ వరల్డ్ రికార్డు విజేత గజల్ గాయకుడు శ్రీనివాస్ లైంగిక ఆరోపణలతో అరెస్టు అనే శీర్షికన వార్త ప్రచురించారు. అయితే గజల్ శ్రీనివాస్ ఫోటోకు మారుగా శ్రీనివాస్ ఫోటోను వార్తలో ఉపయోగించారు. దీంతో శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. ఆ మీడియా సంస్థను కోర్టుకీడుస్తానని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

పిబి శ్రీనివాస్ మరణించినప్పుడు కూడా...

పిబి శ్రీనివాస్ మరణించినప్పుడు కూడా...

కొన్నేళ్ల కిందట ప్రముఖ గాయకుడు పీబీ శ్రీనివాస్ మరణించినప్పుడు సైతం కొంతమంది పాత్రికేయులు తన బయోడేటాతో వార్తలు రాశారని, ప్రస్తుతం ఎవరో సింగర్ శ్రీనివాస్ లైంగిక ఆరోపణల మీద హైదరాబాద్‌లో అరెస్టు అయితే, తన ఫొటో పెట్టారని సింగర్ శ్రీనివాస్ అన్నారు. తన పరువుకు భంగం కలిగించినందుకు ఈ సారి తాను కోర్టుకు వెళ్లాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. న్యాయ నిపుణులెవరైనా తనకు సాయం చేయగలరా? ఈ విషయంపై నేను నిజంగా చాలా ఆగ్రహంతో ఉన్నానని ఆయన పోస్టులో అన్నారు.

ట్విట్టర్‌లో సైతం

ట్విట్టర్‌లో సైతం

ట్విటర్‌లో కూడా ఓ జర్నలిస్టు పేరును ఉటంకిస్తూ - "నా పేరు శ్రీనివాస్... నేను చెన్నైలో ఉంటాను.. ఇదే పేరుతో ఎవరో శ్రీనివాస్ హైదరాబాద్‌లో అరెస్టైతే... మీ వెబ్‌సైట్ నా ఫోటో ప్రచురించింది. ఇందుకు మీరు నాకు క్షమాపణ చెప్పి నష్టపరిహారం చెల్లించాలి" అని రాశారు. కేసు పెట్టడం వల్ల తనకు ఏం జరగదని, అయితే ఏదో ఒకటి చేయాలి కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీనివాస్ ఓ మీడియా ప్రతినిధితో అన్నారు.

తొందరపాటు వల్ల అలా...

తొందరపాటు వల్ల అలా...

అందరి కన్నా ముందు వార్త రాయాలనే సంచలనం వల్ల మీడియాలో చాలా తప్పులు వస్తున్నాయని, దీని స్థానంలో మళ్లీ పాత జర్నలిజంలోని మంచిరోజులు రావాలని సింగర్ శ్రీనివాస్ అన్నారు. శ్రీనివాస్ ఫోటోతో వార్తరాసిన వెబ్‌సైట్ ఆయనకు ఫేస్‌బుక్ వేదికగా క్షమాపణ చెప్పంది. ఆయన ఫోటోతో ఉన్న వార్తను తొలగించినట్లు తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Popular Singer, Show host and performer Srinivas expressed angry at a news website for wrongly publishing his image in the artcle on the arrest of Ghazal Srinivas.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి