డ్రగ్ కేసు:గదులను మారుస్తూ విచారణ ఇలా, కొంపముంచిన కెల్విన్
డ్రగ్ కేసులో సినీ ప్రముఖులను సిట్ అధికారులు అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఏ బృందంలో ఏ అధికారి ఉన్నాడో కూడ తెలియని పరిస్థితి ఉంది. ఎవరు ఎవరిని విచారణ చేస్తారో కూడ తెలియదు. విచారణ తంతును వీడియో త
హైదరాబాద్: డ్రగ్ కేసులో సినీ ప్రముఖులను సిట్ అధికారులు అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఏ బృందంలో ఏ అధికారి ఉన్నాడో కూడ తెలియని పరిస్థితి ఉంది. ఎవరు ఎవరిని విచారణ చేస్తారో కూడ తెలియదు. విచారణ తంతును వీడియో తీయిస్తున్నారని తెలుస్తోంది.డ్రగ్ కేసు:
డ్రగ్ కేసుకు సంబందించి సినీ ప్రముఖులను విచారణ ఈ నెల 19వ, తేది నుండి ప్రారంభమైంది. ఈ విచారణ ఈ నెల 27వ, తేది వరకు కొనసాగుతోంది. అయితే విచారణను అత్యంత పకడ్బందీగా కొనసాగిస్తున్నారు ఎక్సైజ్ శాఖాధికారులు
ఇప్పటికే ముగ్గురిని విచారించారు. శనివారం నాడు సినీ నటుడు తరుణ్‌ను విచారించనున్నారు. ముగ్గురి విచారణలోనే ఈ విషయమై కీలక సమాచారాన్ని రాబట్టారనే ప్రచారం సాగుతోంది. అయితే కీలక అంశాలను సుబ్బరాజు వెల్లడించారని కూడ ఎక్సైజ్ శాఖాధికారులు ప్రకటించారు.
మూడోరోజున నటుడు సుబ్బరాజును 13 గంటలపాటు విచారించారు. సుబ్బరాజు తమ విచారణకు సహకరించారని సిట్ అధికారులు ప్రకటించారు. ఆయన నుండి బ్లడ్ శాంపిళ్ళను సేకరించారు.

కొంప ముంచిన సెల్ఫీలు
డ్రగ్ మాఫియా నాయకుడు కెల్విన్‌తో సినీ తారల సెల్ఫీలు కొంపముంచాయి. డ్రగ్స్ ఇచ్చేందుకు వెళ్ళిన సమయంలో కెల్విన్ సినీ ప్రముఖులతో సెల్పీలు దిగారు. ఈ సెల్ఫీలను ఎక్సైజ్ అధికారులు సంపాదించారు. ఈ సెల్పీల ఆధారంగా సెలబ్రిటీలను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కెల్విన్‌తో ఎప్పటి నుండి సంబంధాలున్నాయి,ఏ సందర్భాల్లో కలిసేవారు. ఏ సందర్భంలో ఈ సెల్పీ దిగారు అనే ప్రశ్నలతో పాటు డ్రగ్స్ ఎలా అందేవి. ఎవరెవరికి డ్రగ్స్ తీసుకొనే అలవాటుందనే అంశాలపై ఆరా తీసేవారు.
Recommended Video


కెల్విన్ నుండి సమాచారమిలా
కెల్విన్ ఫోన్ నుండి పోలీసులు పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించారు. ఆయన ఫోన్‌లో ఉన్న సీక్రెట్ ఫోల్డర్‌లో ఉన్న సమాచారాన్ని డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ ఫోన్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే సినీ ప్రముఖులకు ఎవరెవరికి డ్రగ్ రాకెట్ తో సంబంధాలున్నాయనే దానిపై స్పష్టత వచ్చింది.దీని ఆధారంగానే సిట్ అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అయితే సినీ ప్రముఖుల విచారణ సందర్భంగా సాగుతున్న సమాచారాన్ని ఆధారంగా విచారణ చేస్తున్నారు.

గదులను మారుస్తూ
అయితే విచారణకు వచ్చిన సినీ ప్రముఖులను తరచూ గదులను మారుస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.అయితే ఈ విషయమై స్పష్టత లేదు.కొంతసేపు విచారణ జరిగిన తర్వాత విచారణాధికారులు అప్పటివరకు నిర్వహించిన గదిలో కాకుండా వేరే గదిలో విచారణను సాగిస్తున్నారనే ప్రచారం కూడ ఉంది. అయితే దీనిపై ఎక్సైజ్ అధికారుల నుండి స్పష్టత రావాల్సి ఉంది.

మూడో కంటికి తెలియకుండానే
సినీ ప్రముఖుల విచారణ సమయంలో సిట్ అధికారుల విచారణను ఆషామాషీగా తీసుకోవడం లేదు. విచారణ విషయంలో జాగ్రత్తలు తీసుకొంటున్నారు. అయితే ఎవరిని ఎవరు విచారిస్తున్నారనే సమాచారం కూడ ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులకు తెలియదు. అప్పటికప్పుడు ఆ సమాచార్ని ఉన్నతాధికారులు ఇస్తున్నారు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని విచారణ చేస్తున్నారు. అంతేకాదు ఈ వ్యవహరాన్ని అంతా వీడియో ద్వారా రికార్డు చేయనున్నారు. విచారణకు హజరైనవారు చెప్పిన అంశాలను రికార్డు ఎవిడెన్స్ కోసం వీడియో రికార్డింగ్ చేస్తున్నారని సమాచారం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications