ఈవెంట్ మేనేజర్స్ లింక్స్‌పై అడిగితే, చెప్పా: నవదీప్, శాంపిల్స్ ఇచ్చేందుకు నో?
ఈవెంట్ మేనేజర్‌తో ఉన్న లింక్‌లు, డ్రగ్స్ వ్యవహారంలో ఉన్న లింక్‌లపై ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు తనను క్లియర్‌గా అడిగారని, తాను సమాధానం చెప్పానని నటుడు నవదీప్ సోమవారం వెల్లడించారు.
హైదరాబాద్: ఈవెంట్ మేనేజర్‌తో ఉన్న లింక్‌లు, డ్రగ్స్ వ్యవహారంలో ఉన్న లింక్‌లపై ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు తనను క్లియర్‌గా అడిగారని, తాను సమాధానం చెప్పానని నటుడు నవదీప్ సోమవారం వెల్లడించారు.
చదవండి: వారిచ్చిన సమాచారం అంతంతే: నవదీప్ చాలా కీలకం

11 గంటల పాటు విచారణ
నవదీప్‌ను సిట్ అధికారులు పదకొండు గంటలకు పైగా విచారించారు. ఉదయం పదిన్నర గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు విచారించారు. విచారణ అనంతరం ఆయన విలేకరులతో పొడిపొడిగా మాట్లాడారు.

సమాధానాలు చెప్పా
విచారణలో సిట్‌కు సహకరించానని నవదీప్ తెలిపారు. తనకు తెలిసిన సమాచారాన్ని వారికి చెప్పానని అన్నారు. సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. అవసరమైతే మళ్లీ ఫోన్ కాల్ చేస్తామని సిట్ అధికారులు చెప్పారన్నారు.

ఈవెంట్ మేనేజర్‌పై ప్రశ్నల వర్షం
ఈవెంట్ మేనెజర్‌లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? డ్రగ్స్ సరఫరా చేస్తారా? డ్రగ్స్ సరఫరా చేస్తే ఎవరెవరికి చేస్తారు? ఏఏ పబ్బులకు చేస్తారు? ఈవెంట్ మేనేజర్లు మీకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తారా? మీకు డ్రగ్ తీసుకునే అలవాటు ఉందా? తదితర ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. జీషన్ అలీ, కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నవదీప్‌ను ప్రశ్నించారు.

శాంపిల్స్ సేకరణకు నవదీప్ నో?
హీరో నవదీప్ రక్త నమూనాలు, వెంట్రుకలు సిట్ అధికారులు సేకరించాలనుకున్నప్పటికీ.. ఆయన నో చెప్పారని తెలుస్తోంది. దీంతో సిట్ వైద్య బృందాన్ని వెనక్కి పంపింది. దీంతో సేకరించలేదని సమాచారం. ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ సేకరించారని తెలుస్తోంది. సుబ్బరాజు, శ్యామ్ కె నాయుడు శాంపిల్స్ సేకరించలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications