స్కూలు బ్యాగులో పాము: షాక్ తిన్న విద్యార్థి, పరుగులు పెట్టారు..

పెన్ను తీసుకుందామని బ్యాగులో చేయి పెట్టిన చిన్నారికి ఏదో మెత్తగా తగలడంతో షాక్ తిన్నాడు. మరోసారి చేయి పెట్టేసరికి.. ఏకంగా పాము బయటకు రావడంతో జడుసుకుని భయంతో పరుగులు పెట్టాడు.

జగిత్యాల: పెన్ను తీసుకుందామని బ్యాగులో చేయి పెట్టిన చిన్నారికి ఏదో మెత్తగా తగలడంతో షాక్ తిన్నాడు. మరోసారి చేయి పెట్టేసరికి.. ఏకంగా పాము బయటకు రావడంతో జడుసుకుని భయంతో పరుగులు పెట్టాడు.

జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామంలోని పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. లంబాడిపల్లి పాఠశాలలో సిరిగిరి ప్రవీణ్‌ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లిన అతను.. నోట్స్ రాసుకోవడానికి పెన్ను కోసం బ్యాగులో చేయి పెట్టాడు.

snake found in a childrens school bag in jagitial district

ఏదో మెత్తగా తగలడంతో అదిరిపడ్డాడు. మరోసారి చేయి పెట్టడంతో ఏకంగా పాము బయటకొచ్చి బుసలు కొట్టింది. దీంతో విద్యార్థులంతా భయంతో పరుగులుపెట్టారు. అక్కడే ఉన్న పాఠశాల సిబ్బంది, స్థానికులు పామును చంపేశారు.

విద్యార్థి ప్రవీణ్ ఇంట్లోనే పాము బ్యాగులోకి దూరి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అతని ఇంటి పరిసర ప్రాంతాల్లో పాములు సంచరిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+