వర్షాకాలం పాముల వీరవిహారం.. జాగ్రత్త లేకుంటే కస్సున కాటేసే ప్రమాదం!

వర్షాకాలం ప్రారంభమైంది. ఈ వర్షాలు రైతులకు ఎంతో కీలకం. వర్షాలు సమృద్ధిగా కురిస్తే దేశం పంటలతో కళకళలాడుతుంది. అయితే ఈ కాలంలో అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలం పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా పాములు బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి. కనుక వర్షాకాలంలో పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

వర్షాకాలం పాముల విషయంలో జాగ్రత్త
సాధారణంగా వర్షాకాలంలో ప్రకృతి . పచ్చదనంతో నిండిపోతుంది. ఏపుగా పెరిగిన గడ్డి, గుబురుగా ఉన్న మొక్కలు పాములకు ఆవాసాలుగా మారుతాయి. ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం కావడంతో విష కీటకాలు విజృంభిస్తాయి. అందులో ముఖ్యంగా పాముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎక్కడికి వెళ్ళినా గుబురుగా చెట్లు ఉన్న చోట, ఏపుగా గడ్డి ఉన్న చోట జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి.

snakes fear in rainy season precaution to farmers students people to avoid snakes bites

రైతులు పొలాల దగ్గర పాముకాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాల కారణంగా పాములు పుట్టల నుంచి బయటకు వచ్చి సంచరిస్తుంటాయి. గడ్డి దుబ్బులు, గడ్డి వాములు, పొలాల వద్ద పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. కనుక రైతులు పొలాలకు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇక చాలామంది ఈ సీజన్ లో బయట కుప్పగా పాతసామాన్లు పెట్టకూడదు, ఇళ్లల్లో సామాన్లు చిందరవందరగా పడేసినా, పాములు నివసించడానికి అనువైన ప్రదేశాలున్నా అక్కడ పాములు చేరే అవకాశం ఉంది.

స్కూల్స్, ఇళ్ళ దగ్గర పాముల విషయంలో జాగ్రత్త
శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, పాడుబడిన పాఠశాలల వద్ద పాములు తిరుగుతుంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు తిరిగే పాఠశాలల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో పాము కాటుతో మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి స్కూల్స్, ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. రాళ్లు, కుప్పలు కుప్పలుగా వస్తువులు ఉండకుండా జాగ్రత్త పడాలి.

ఈ జాగ్రత్తలతో పాముల బెడద తప్పించుకోండి
ఇంట్లోకి పాములు రాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. నీరు బయటకు వెళ్ళే రంధ్రాలను మూసివేయడం ద్వారా కూడా పాములు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. రైతులు, ప్రజలు పాము కాటుకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితంగా చూసుకుని జాగ్రత్తగా నడవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+