ఓరుగల్లుకు ఆగస్ట్ 15న అదిరిపోయే స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అభివృద్ధి చేయడానికి ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలోనే అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని, క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా దానికి తెలంగాణ సీఎం సానుకూలంగా స్పందించారు.

ఆగస్టు 15వ తేదీన స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభం
వరంగల్ నగరంలో ఆగస్టు 15వ తేదీన స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించబడుతుంది అని తాజా పరిణామాలతో అర్థమవుతుంది. తెలంగాణ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కావలసిన తాత్కాలికభవనం, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Special gift for warangal on August 15th Ready to start sports school

Take a Poll

జయేష్ రంజన్ సానుకూల స్పందన
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజులు జయేష్ రంజన్ కు విన్నవించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం గురించి చర్చించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల వద్ద ఎన్హెచ్ 163కి అనుకుని ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిని స్పోర్ట్స్ స్కూల్ కోసం కేటాయించడానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.

స్పోర్ట్స్ స్కూల్ తో పాటు క్రికెట్ స్టేడియం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థనతో త్వరలోనే స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు జరుగుతుందన్నారు. ఇక క్రికెట్ స్టేడియం కోసం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల దగ్గర 50 ఎకరాల స్థలం అనువుగా ఉంటుందని కూడా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కృతనిశ్చయం
వరంగల్ జిల్లా నుంచి చాలామంది అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి పేరెన్నిక గన్న క్రీడాకారులు ఉన్నారని, ఇది సీఎం దృష్టికి తీసుకు వెళ్లినట్టు కడియం శ్రీహరి తెలిపారు. క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు, స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఆగస్టు 15కు బహుమతిగా స్పోర్ట్స్ స్కూల్ ను ప్రారంభిస్తామని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+