Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీరామ నవమి ఎఫెక్ట్.. హైదరాబాద్ లో వైన్స్ దగ్గర మందుబాబుల క్యూ!!

హైదరాబాద్ లో నేడు మద్యం ప్రియులు ఎండను సైతం లెక్కచేయకుండా వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. ఈరోజు మద్యం కొనుగోలు చేయకుంటే రేపు దొరకదు అన్నట్టు మద్యం షాపుల ముందు పడిగాపులు పడుతున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ లో రేపు లిక్కర్ అమ్మకాలు జరపరాదనే ఆదేశాలతో మందుబాబులు ఈ రోజే అగచాట్లు పడుతున్నారు.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్
రాష్ట్రంలో బీర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులకు ఊహించని షాక్ తగిలింది. రేపు హైదరాబాద్ నగరంలో వైన్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో మందు బాబులకు ఇది బ్యాడ్ న్యూస్ గా మారింది. రేపు శ్రీరామనవమి కావడంతో వాడ వాడలా శ్రీరామనవమి వేడుకలను అట్టహాసంగా జరుపుకోనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Sri Rama Navami effect wine shops bandh tomorrow queue near wines shops in Hyderabad today

రేపు హైదరాబాద్ లో వైన్స్ బంద్
అత్యంత భక్తిభావంతో శ్రీరామ నవమి వేడుకలు జరగనున్న నేపధ్యంలో రేపు లిక్కర్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి, 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలో బార్లు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు తెలిస్తే కఠిన చర్యలు
శ్రీరామనవమి పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వైన్ షాపులు మూసివేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతోనే రేపు అంతా మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని తెలుసుకున్న మద్యం ప్రియులు లిక్కర్ షాపులకు పరుగులు పెడుతున్నారు. రేపటిది కూడా ఈరోజే కొనుగోలు చేసుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+