• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గైర్హాజర్ వ్యూహం: కెసిఆర్‌తో స్టీఫెన్ సన్ భేటీ, గవర్నర్‌తో సిఎస్

By Pratap
|

హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి వీడడం లేదు. ఆరోగ్యం బాగా లేదని చెప్పి విచారణకు గైర్హాజరైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య విషయంలో ఎసిబి ఏ విధంగా ముందడుగు వేయబోతుందనేది తెలియడం లేదు. కాగా, తెలంగాణ ఎసిబి నోటీసులు ఇస్తే తీసుకోబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినదాన్ని ఆచరణలో పెడుతున్నట్లు కనిపిస్తోంది. పైగా, తెలంగాణ ఎసిబి చర్యలు తీసుకోవడానికి ఇబ్బంది కలిగిస్తూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్నట్లు కనిపిస్తోంది.

నోటుకు ఓటు కేసులో నాలుగో నిందితుడైన మత్తయ్యను తెలంగాణ ఎసిబి పట్టుకోలేకపోవడానికి ప్రధాన కారణం అతను తెలంగాణ సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలు పెట్టడమేనని అంటున్నారు. సండ్ర వెంకట వీరయ్య విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆస్పత్రికి వస్తే విచారణకు సహకరిస్తానని తన లేఖలో చెప్పిన సండ్ర తాను ఏ ఆస్పత్రిలో ఉన్నాడో చెప్పలేదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆయన ఆచూకీపై రహస్యంగా వ్యవహరిస్తున్నారు.

ఓటుకు నోటు కేసుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యలు గమనార్హం. ఈ కేసులో ముద్దాయిలకు విజయవాడ షెల్టర్ జోన్‌గా మారిపోయిందని ఆయన విమర్శించారు. ఈ కేసులో నాలుగో ముద్దాయి మత్తయ్కు టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆశ్రయం కల్పించారని ఆయన ఆరోపించారు.

కేసు నుంచి బయటపడడానికి పోలీసు అధికారులతో వారికి తర్ఫీదు ఇప్పిస్తున్నారని ఆయన అన్నారు. తప్పు చేయకపోతే ఇలాంటి కష్టాలు పడాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని ఆయన అన్నారు.

ఆ రకంగా ఎసిబి జారీ చేసే నోటీసులను అందుకోకుండా, ఏదో విధంగా నోటీసులు ఇచ్చినా విచారణకు ఎవరు కూడా హాజరు కాకుండా చూసే వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే సండ్ర వెంకట వీరయ్య ఎసిబి విచారణకు డుమ్మా కొట్టాడని అంటున్నారు. దాదాపు 20 మందికి తెలంగాణ ఎసిబి నోటీసులు జారీ చేయవచ్చునని ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి. కానీ ఇంత వరకు ఏ విధమైన పరిణామాలు కూడా చోటు చేసుకోలేదు.

Stephenson meets KCR: Rajiv Sharma with governor

నోటుకు ఓటు కేసుకు సంబంధించిన 14 ఆడియో, వీడియో టేపులను, సెల్ ఫోన్లను, తదితరాలను ఎసిబి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపించింది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి నివేదిక వస్తే తప్ప ఎసిబి ముందుకు వెళ్లకూడదనే వైఖరిని అవలంబిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వాంగ్మూలమే కీలకమని భావిస్తున్నారు. ఆ వాంగ్మూలం కూడా కోర్టుకు చేరింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుతో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ శనివారం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు వీరి సమావేశం జరిగింది. ఓటుకు నోటు కేసులో శుక్రావరం ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించిన వివరాలను కేసీఆర్‌కు స్టీఫెన్‌సన్‌ వివరించినట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గవర్నర్ నరసింహన్‌ను రాజభవన్‌లో కలిశారు. కేసుకు సంబంధించిన వివరాలనే రాజీవ్ శర్మ గవర్నర్‌కు వివరించారా, మరేదైనా విషయం ఉందా అనేది తెలియడం లేదు.

English summary
Telangana nominated MLA stephenson met CM K Chandrasekhar Rao. Meanwhile Telangana CS Rajiv Sharma met governor Narasimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X