హైదరాబాద్ లో వింత లవ్ స్టోరీ.. నీ భార్యను నాకు ఇచ్చేయ్ అంటూ భర్తకు ప్రపోజల్
నీ భార్యను నాకు ఇచ్చేయ్.. జీవితాంతం సుఖంగా చూసుకుంటా.. ఈ డైలాగ్ విన్న వెంటనే ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ వినలేదు అనుకుంటున్నారా.. షాకింగ్ గా ఉన్నప్పటికీ సినిమాల్లో మాత్రమే ఈ తరహా డైలాగ్ ని ఎక్స్ పెక్ట్ చేయగలం.. కానీ రియల్ లైఫ్ లో ఇంతటి సాహసం చేశాడు ఓ లారీ డ్రైవర్. ఇంతకీ ఈ స్టోరీ ఏంటి.. ఏం జరిగిందో తెలుసుకుందాం..
విశాఖపట్టణం సమీపంలోని ఆనందపురానికి చెందిన ఇద్దరు దంపతులు.. సినిమాలపై మక్కువతో నాలుగేళ్ళ క్రితం హైదరాబాద్‌కు వచ్చేశారు. యూసఫ్‌గూడ పక్కన యాదగిరి నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇరువురు జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు మహిళకు తన సమీప గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సూర్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పెరగటంతో, ఐదు రోజుల క్రితం సూర్యనారాయణ ఏకంగా సదరు మహిళ ఇంటికి వవచ్చేశాడు.

భర్త ముందే ప్రపోజల్..
తన భార్య, కొడుకు, కూతురు తనను పట్టించుకోవడం లేదని వారితో చెబుతూ బాధపడ్డాడు సూర్యనారాయణ. ఈ పరిస్థితుల్లోనే సూర్యనారాయణకు, సదరు మహిళకు మధ్య ఇంకాస్త చనువు పెరిగింది.
ఆమెపై ఇష్టం పెంచుకున్న ఆయన.. గత శనివారం రాత్రి మద్యం సేవించి వారి ఇంటికొచ్చి తన మనస్సులో ఉన్నదంతా దంపతుల ముందే చెప్పేశాడు. మీ ఆవిడ అంటే నాకు ప్రాణం.. ఆవిడ నా గుండె. ఆమె లేకపోతే నేనుండలేను. నాకు మీ ఆవిడ కావాలి. ఆమెను నాకు ఇచ్చేయ్.. నాతో పంపించు.. జీవితాంతం సంతోషంగా ఉండేలా మీ ఆవిడని నేను చూసుకుంటా అని ప్రియురాలి భర్తతో అన్నాడు.
దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఆమె భర్త.. నా భార్యని ఇవ్వమని నన్నే అడుగుతావా ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యనారాయణను ఇంటి నుంచి గెంటేశాడు. ఆ రోజు రాత్రి ఆ ఇంటి బయటే నిద్రించిన సూర్యనారాయణ.. ఆదివారం తెల్లవారుజామున యూసుఫ్ గూడ పోలీస్ బెటాలియన్ పెట్రోల్ బంకుకు వెళ్లి.. పెట్రోల్‌ను కొని వారి ఇంటి ఎదుట.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సూర్యనారాయణ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications