ఆ సెగ్మెంటా.. మాకొద్దు అంటున్న కాంగ్రెస్ నేతలు.. రేవంత్ రెడ్డికి తలనొప్పిగా ఆర్మూర్!!
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో హస్తం పార్టీకి లీడర్లు కరువయ్యారు.సెగ్మెంట్ బాధ్యతలు తీసుకునేందుకు లీడర్లు ముందుకు రావటం లేదు. ఎవర్ని అడిగినా ఐయామ్ సారీ అని చెప్పేస్తున్నారని స్థానికంగా హస్తం పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. ఫలితంగా గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఇంచార్జీలే లేని పరిస్థితి అక్కడ నెలకొంది .
ఒకప్పుడు హస్తం పార్టీకి కంచుకోట ఆర్మూర్ నియోజకవర్గం. పదేళ్ల క్రితం వరకు ఆ పార్టీ నేతలే ఆ నియోజకవర్గాన్ని శాసించారు. తెలంగాణ ఆవిర్భావ అనంతరం ఆ పార్టీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది .తాజాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓటమిపాలైన ఆకుల లలిత సైతం చివరి నిమిషంలో గులాబీ గూటికి చేరారు . దీంతో ఆ పార్టీకి క్యాడర్ ఉన్నా లీడర్లు కరువయ్యారు.

ఇటీవల ఆర్మూర్ లో జరిగిన రేవంత్ పాదయాత్రలో లీడర్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఓ దశలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తాను ఆర్మూర్ నుంచి పోటీ చేస్తానంటూ రేవంత్ సభలో ప్రకటించినా ఆయన ఇదంతా క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు అని మళ్లీ చెప్పటం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశం అయ్యింది.
గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన మాజీ మంత్రి సంతోష్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, గులాబీ తీర్దం పుచ్చుకున్నారు . 2009 ఎన్నికల్లో పోటీ చేసి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి హస్తం పార్టీకి హ్యాండిచ్చారు. తాజాగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన ఆకుల లలిత సైతం గులాబీ గూటికి చేరారు. అక్కడ ఇంచార్జీని పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతుంది.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఆర్ముర్ నుంచి బరిలో దిగుతారని కొన్నాళ్ళు ప్రచారం జరిగినప్పటికీ, ఆయన మనస్సు మార్చుకుని అర్బన్ పై గురి పెట్టారు.తాజా పరిస్థితుల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆర్మూర్ లో కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని కొత్త వారి కోసం అన్వేషిస్తున్నారని సమాచారం. స్థానిక లీడర్లు ఎవరు రాక పోతే బాల్కొండ కు చెందిన లీడర్ల లో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించా లని భావిస్తున్నట్టు సమాచారం.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications