హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లి పేరుతో లాయర్‌తో సహజీవనం: ఎస్సై పైన రేప్ కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళా న్యాయవాదిని అత్యాచారం చేశారనే ఆరోపణలతో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ అరెస్టయ్యాడు. ఈ సంఘటన ముషీరాబాదులో జరిగింది. బాధిత మహిళా అడ్వోక్ట్ ఎస్సై పైన ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. నిందితుడి పేరు ఆదిత్యనారాయణ. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 29 ఏళ్ల మహిళా న్యాయవాది అతని పైన ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో సంబంధం కొనసాగించాడు.

కొద్ది నెలల క్రితం వీరి మధ్య పరిచయం ఏర్పడింది. వారి మధ్య ఫిజికల్ రిలేషన్ షిప్ కూడా ఉంది. ఆమెకు సదరు ఎస్సై పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తీరా, అతను మరో యువతితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. విషయం తెలిసిన సదరు న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Sub inspector held for raping lawyer

బాధితురాలు 2014లో ఓసారి సచివాలయానికి వెళ్లింది. అప్పుడు కాలుజారి కిందపడింది. ఆ సమయంలో నిందితుడు ఆమెకు సాయం చేశాడు. అక్కడి నుంచి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఫిజికల్ రిలేషన్ షిప్ వరకు దారి తీసింది. ఇద్దరు కొద్ది రోజులు సహజీవనం చేశారు.

తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సదరు ఎస్సై పైన రేప్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

పోలీసులు నిందితుడు ఆదిత్యనారాయణను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. అతనికి కోర్డు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అతని పైన సెస్షన్ 376 (అత్యాచారం), 417, 420 (చీటింగ్) కింద కేసు నమోదు చేశారు. కాగా, బాధితుడికి ఎంగేజ్ మెంట్‌తో పాటు పెళ్లైనట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

English summary
Police have now registered an FIR against him. “We arrested Adinarayana and sent him to judicial custody for alleged rape and cheating. A case was booked against him under Section 376 (rape), 417 and 420 (for cheating),” said Musheerabad inspector B. Mohan Kumar. An investigation has also been launched. Sources said that the SI’s wedding was scheduled to take place this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X