దాస్యం వినయ్ భాస్కర్ కు సన్ స్ట్రోక్.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్!! (వీడియో)
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కొంతమంది పొలిటీషియన్ల కుటుంబాల్లో కూడా చిచ్చు పెడుతోంది. ఎన్నికల ముందు వరకు ఒకటే మాట మీద నడిచిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబంలో ఆయన ఓటమి చిచ్చు పెట్టింది.
మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు సన్ స్ట్రోక్ తగిలింది. హన్మకొండ రెడ్డి కాలనీ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ప్రణయ్ అన్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో తన బాబాయ్ పై అసహనాన్ని ప్రదర్శించి బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్టు దాస్యం ఆభినవ్ భాస్కర్ వెల్లడించారు.

మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు 60వ డివిజన్ కార్పొరేట్ ర్ దాస్యం అభినవ్ భాస్కర్ త్వరలోనే బిఆర్ఎస్ పార్టీని వీడనున్నారు . తన బాబాయి దగ్గర తనకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోసం చాలా త్యాగాలు చేశానని పేర్కొన్నారు.
1998లో తన తండ్రి మరణించిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్ లో పార్టీ తన తల్లిని ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరగా తన మరిది దాస్యం వినయ్ భాస్కర్ కు అవకాశం కల్పించాలని ఆనాడు తన తల్లి త్యాగం చేస్తే, 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు పరకాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామని చెప్పినా తీసుకోకుండా తాను బాబాయ్ కోసం త్యాగం చేశానన్నారు .
దాస్యం వినయ్ భాస్కర్ కు సన్ స్ట్రోక్: BRS పార్టీని వీడనున్నట్టు దాస్యం ఆభినవ్ భాస్కర్ ప్రకటన..!!#DasyamAbhinavBhaskar #BRS #BRSParty #Oneindiatelugu pic.twitter.com/GhWHA5pwH7
— oneindiatelugu (@oneindiatelugu) February 6, 2024
తమ కుటుంబంలో కలహాలు వస్తాయని మా బాబాయ్ కోసం పని చేశానని పేర్కొన్నారు. అయితే వినయ్ భాస్కర్ మాత్రం ఆయన చుట్టూ ఉండే నలుగురు వ్యక్తుల మాటలు నమ్మి తన ఓటమికి అభినవ భాస్కర్ కారణమని చెప్పడం తనను బాగా కలచివేసిందని అభినవ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం లేని చోట తాను ఉండలేనని, త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు గా ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications