వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్కెట్లో చాలా ఉన్నాయి, అన్నీ వద్దు: తెలంగాణ గ్రూప్ పరీక్షలపై సుంకిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్సీ) పరీక్షలకు పెద్ద యెత్తున అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. సిలబస్‌కు సంబంధించిన పుస్తకాల కోసం అభ్యర్థులు ఎక్కడెక్కడో అన్వేషిస్తున్నారు. పుస్తకాల షాపులు, తెలుగు అకాడమీ పుస్తకాలు కొనడానికి వచ్చే అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. మీడియా కూడా రకరకాలుగా అభ్యర్థులకు తగిన సమాచారం అందించడానికి ప్రయత్నిస్తోంది.

ఈ స్థితిలో విద్యార్థులు టిఎస్‌పిఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే విషయంపై ప్రముఖ రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వన్ ఇండియా తెలుగుతో మాట్లాడారు. ఆయన రాసిన తెలంగాణ చరిత్ర గ్రంథం ప్రామాణికమైన రచనగా ఇప్పటికే విశేషమైన గుర్తింపు పొందింది. ప్రాచీన చరిత్ర అది అందిస్తుంది. అభ్యర్థులకు చేసిన సూచనలను, చెప్పిన పుస్తకాల వివరాలను ఆయన మాటల్లోనే చదవండి.

గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్లో తెలంగాణ చరిత్రకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. చరిత్ర అధ్యయనం కీలకమైంది, నిర్ణాయకమైంది కూడా. అందువల్ల చరిత్ర అధ్యయనం విషంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చరిత్రను అవగాహన చేసుకునే పద్థతిలో చదవాలి. బట్టీ పట్టే పద్ధతి మానుకోవాలి. విషయపరిజ్ఝానాన్ని పెంచుకోవాలి,.

మన చరిత్ర, మన మూలాలు, సంస్కృతి, ప్రాంత విశిష్టత ఏమిటనే వాటిని తెలుసుకోవాలనే కుతూహలంతో అధ్యయనం చేస్తే విషయాలు గుర్తుంటాయి. చదవిటేప్పుడు కాలక్రమణిక పద్ధతిని అనుసరించాలి. మార్కెట్లో బిట్ కొశ్చన్స్, బుల్లెట్ పాయింట్స్ పుస్తకాలు చాలా ఉన్నాయి. దాదాపుగా అవన్నీ ప్రామాణిక పుస్తకాల నుంచి కాపీ చేసినవే. మార్కెట్లో ఉన్న ప్రామాణిక పుస్తకాలనే చదవాలి. ప్రామాణిక పుస్తకాలను చదివిన తర్వాత అవసరమైతే పరీక్షించుకోవడానికి వాటిని వాడుకోవచ్చు.

Sunkireddy Narayana Reddy suggests books for TSPSC

ఏయే పుస్తకాలు చదవాలి..

తెలంగాణ ప్రాచీన, ఆధునిక చరిత్రలు చదవాలి. క్రీస్తు పూర్వం నుంచి 1948 వరకు ప్రాచీన చరిత్ర కాగా, 1948 నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ఆధునిక చరిత్రగా పరిగణిస్తున్నారు. ఇలాగే సిలబస్‌లో ఉంది.

ప్రాచీన చరిత్రకు

సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తెలంగాణ చరిత్ర, పివి పరబ్రహ్మ శాస్త్రి కాకతీయులు, తేరాల సత్యనారాయణ శర్మ రాచకొండ చరిత్ర, కాకాని చక్రపాణి కుతుబ్ షాహీలు, నరేంద్ర లూథర్ హైదరాబాద్ జీవిత కథ, మందుముల నర్సింగరావు, కెవి రంగారెడ్డి తదితరుల ఆత్మకథలు ప్రాచీన చరిత్ర కోసం చదవాలి.

ఆధునిక చరిత్ర కోసం ఆదిరాజు వెంకటేశ్వర రావు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు, శోభా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల చరిత్ర, ఎలకట్టె శంకరరావు తెలంగాణ ఉద్యమాలు - చరిత్ర, సంగిశెట్టి హమారా హైదరాబాద్, షబ్నవీస్, ఇతర వ్యాసాలు, కాసుల ప్రతాపరెడ్డి రాబయో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు - రాజకీయ, సాంస్కృతికోద్యమాలు, ఇతర వ్యాసాలు, గౌతమ్ పింగ్లే ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణకు తెలుగు అనువాదం పడిలేచిన తెలంగాణ చదవాలి. అలాగే ఘంటా చక్రపాణి తెలంగాణ జైత్రయాత్ర, జయశంకర్ వొడవని ముచ్చట, తెలంగాణ రాష్ట్ర డిమాండ్, తెలంగాణలో ఏం జరుగుతోంది చదవాలి. వెలిచాల జగపతి రావు విద్య, వైద్య, నీటి రంగాలపై రాసిన పుస్తకాలు పనికి వస్తాయి. తల్లడిల్లుతున్న తెలంగాణ, దగా పడ్డ తెలంగాణ పుస్తకాలు కూడా ఉన్నాయి.

ఆ పుస్తకాలన్నీ చదివిన తర్వాత బిట్స్ కొశ్చన్స్, బుల్లెట్ పాయింట్స్ పుస్తకాలకు వెళ్లాలి. వాటిలో తప్పులు ఉండే అవకాశం ఉంది కాబట్టి క్రాస్ చెక్ చేసుకోవడం కూడా ముఖ్యం.

English summary
n eminent scholar Sunkireddy Narayana Reddy suggests TSPSC candidates to read systematically for group 1 and group 2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X