సస్పెన్స్, రేవంత్ రాజీనామా: కారణాలు అంతు చిక్కడం లేదు, టీడీపీ ఎందుకలా?

Posted By:
Subscribe to Oneindia Telugu
Revanth Reddy resignation High drama : "రాజీనామా" చెయ్యలేదంటగా ? | Oneindia Telugu

హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామాపై హైడ్రామా కొనసాగుతోంది. ఆయన రాజీనామా ఇచ్చి రెండు వారాలు అవుతోంది. దీనిపై ఇప్పుడు అందరిలోను చర్చ సాగుతోంది. ఆయన రాజీనామాపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రాజీనామా: అన్నీ చేశారు కానీ, రేవంత్ తెలివిగా తప్పించుకుంటున్నారా?

 అందుకు గల కారణాలు అంతు చిక్కడం లేదు

అందుకు గల కారణాలు అంతు చిక్కడం లేదు

అసలు రేవంత్ రాజీనామా చేశారా, ఒకవేళ చేస్తే రాజీనామా లేఖను నేరుగా స్పీకర్‌కు ఇవ్వకుండా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చినట్లు, వంటి ప్రశ్నలు ఇప్పటికే తలెత్తుతున్నాయి.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ స్పీకర్ ఫార్మాట్లో చంద్రబాబుకు ఇవ్వడానికి గల కారణాలు అంతు చిక్కటం లేదంటున్నారు.

 స్పీకర్‍‌కు ఫిర్యాదు చేయలేదు, ఎందుకు

స్పీకర్‍‌కు ఫిర్యాదు చేయలేదు, ఎందుకు

మరోవైపు, రేవంత్ రెడ్డి రాజీనామా అంశాన్ని తెలంగాణ టీడీపీ నేతలు కూడా అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. అయితే, రేవంత్‌కు రాజీనామా చేయాలని ఉంటే నేరుగా స్పీకర్‌కు ఇవ్వాలి గానీ చంద్రబాబుకు ఇవ్వడం ఏమిటని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఆయన పార్టీ మారినా ఇప్పటి వరకు స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేయలేదు.

 రేవంత్ ఓడిపోతే

రేవంత్ ఓడిపోతే

కొడంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ కూడా తర్జన భర్జన పడుతోందని తెలుస్తోంది. ఉప ఎన్నిక అనివార్యమైతే పర్యావసనాలపై కాంగ్రెస్ సీనియర్లు వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్‌లో రేవంత్‌ ఓడిపోతే, ఆయన వ్యక్తిగతంగానే కాకుండా, కాంగ్రెస్‌ పార్టీ పరంగానూ పరాజయం పాలైనట్లవుతుందని కొందరు అంటున్నారు.

 రేవంత్ ఒక్కడి కోసం కాంగ్రెస్ ఇమేజ్ పణంగా పెట్టాలా?

రేవంత్ ఒక్కడి కోసం కాంగ్రెస్ ఇమేజ్ పణంగా పెట్టాలా?

రేవంత్‌ ఒక్కడి కోసం ఉపఎన్నికకు సిద్ధపడి, అనుకోని పరిస్థితుల్లో ఓడిపోతే, దాని ప్రభావం పార్టీపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొడంగల్‌లో దఫదఫాలుగా చేరికలతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఉత్సాహంగా ఉందని భావిస్తున్నారు.

పార్టీలు మాత్రం పట్టుదలతో లేవు

పార్టీలు మాత్రం పట్టుదలతో లేవు

టీఆర్ఎస్ కూడా రాజీనామాపై పట్టుగా లేదు. రాజీనామా స్పీకర్‌కు అందితే మాత్రం వెంటనే ఆమోదించే అవకాశముంది. పరిస్థితులు చూస్తుంటే రాజీనామాపై రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? లేదా ఉప ఎన్నిక ద్వారా నిజంగానే తన సత్తా చూపించాలని భావిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. అయితే, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు మాత్రం ఉప ఎన్నికపై పట్టుదలతో లేవని తెలుస్తోంది.

 అలా చేయకుంటే అప్పటి దాకా సస్పెన్స్

అలా చేయకుంటే అప్పటి దాకా సస్పెన్స్

కొడంగల్‌ ఉపఎన్నిక వస్తుందా? రాదా? అనేది రేవంత్‌, కాంగ్రెస్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ రేవంత్‌ స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను అందిస్తేనే కొడంగల్‌ ఉపఎన్నిక అనివార్యం అవుతుంది. లేదంటే రేవంత్‌ రాజీనామాపై ప్రతిష్ఠంభన సాధారణ ఎన్నికల వరకు కొనసాగవచ్చునని భావిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Suspense on Telangana Congress Party leader Revanth Reddy's resignation.
Please Wait while comments are loading...