సొంత కూతుర్నే ఎత్తుకెళ్లిందని తండ్రి ఫిర్యాదు: తమిళ నటిపై కిడ్నాప్ కేసు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌ : ప్రముఖ తమిళ నటులు విజయ్‌కుమార్‌-మంజుల దంపతుల కుమార్తె వనితపై అల్వాల్‌ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తండ్రి వద్ద ఉంటున్న కుమార్తెను కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకెళ్లిందన్న ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌, ఛీటింగ్‌, నిబంధనల అతిక్రమణ కేసు నమోదుచేశారు.

అల్వాల్‌ సీఐ ఆనంద్‌రెడ్డి, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. 2007లో ఐటీ రంగానికి చెందిన తమిళనాడు వాసి ఆనంద్‌రాజన్‌.. వనితను రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకొన్నారు.

Tamil actress booked for kidnapping her own daughter

2012లో వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. వీరి కుమార్తె జెనిత పరస్పర అవగాహన ఒప్పందం ప్రకారం తండ్రి వద్ద ఉండాలని తమిళనాడులోని కోర్టు ఆదేశాలిచ్చింది.అయితే, కుమార్తెను చూడాలని అనుకొన్నపుడు మాత్రం అభ్యంతరం ఉండదని తల్లికి అనుమతి ఇచ్చింది.

Tamil actress booked for kidnapping her own daughter

కాగా, ఆనంద్‌రాజన్‌ నగరంలోని అల్వాల్‌లో ఉంటూ ఇక్కడే పాపను పెంచుతున్నాడు. ప్రస్తుతం జెనితకు ఎనిమిదేళ్లు. ఏప్రిల్‌లో వనిత కొంతమందిని తీసుకొచ్చి ఆనంద్‌రాజన్‌ ఇంటిపై దాడి చేసి జెనితను తీసుకెళ్లింది. కూతురు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న ఆయన ఫలితం లేకపోవడంతో రెండురోజుల కిందట పోలీసులను ఆశ్రయించారు. తన కూతురును తనకు ఇప్పించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The police in Alwal has booked a case against Tamil actress Vanitha Vijaykumar for ‘kidnapping’ her own daughter. This followed a complaint from her husba-nd Anandraj, who claimed that the court had given him the custody of the eight-year-old child.
Please Wait while comments are loading...