ప్రభుత్వంపై పోరాటం చేయాలని టిడిపి, బిజెపి ఎమ్మెల్యేల నిర్ణయం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ ఇచ్చిన హమీలు అమలు కావడం లేదని బిజెపి శాసనసభపక్ష నాయకుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. బిజెపి, టిడిపి ఎమ్మెల్యేల సమావేశం గురువారం నాడు గోల్కొండ హోటల్‌లో జరిగింది. ఈ సమావేశానికి టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గైరాజరయ్యారు.

వాళ్ళంతా కెసిఆర్ మనుషులే: టిడిపి నేతలపై రేవంత్‌ సంచలనం

టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏవీ సరిగ్గా అమలు కావడం లేదని, సొంత డబ్బ కొట్టుకుంటోందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాల స్థలం, కేజీ టూ పీజీ, ఫీజు రీయంబర్స్ మెంట్ లాంటి పథకాలు అమలు కావడం లేదని బిజెపి శాసనసభపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేల సమావేశం వివరాలను కిషన్‌రెడ్డి మీడియాకు వివరించారు.

Tdp, Bjp mla's plans to fight against governament in Assembly

ఆరోగ్యశ్రీ, తెల్ల రేషన్ కార్డులు.. ఈ పథకాలన్నీ సరిగ్గా అమలు జరపడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. చాలా రోజుల తర్వాత శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయని, ఈ సమావేశాల్లో టీడీపీ, బీజేపీ కలిసి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ దొందూ..దొందేనని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలనసాగించిందో, ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అదే విధంగా పాలన సాగిస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అడుగుజాడల్లో కేసీఆర్ ముందుకు వెళుతున్నారని విమర్శించారు.

రేపటి నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో బీజేపీ, టీడీపీలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రకటించారు.ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను శాసనసభ వేధికగా ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్టు చెప్పారు.

అకాల వర్షాలవల్ల జరిగిన పంట నష్టం పరిహారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, నేరెల్ల ఘటన తదితర 25 అంశాలను టీడీపీ, బీజేపీ గుర్తించిందని, పరస్పర అవగాహనతో సమస్యల పరిష్కారం కోసం సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని సండ్ర వెంకటవీరయ్య చెప్పారు.

ఇదిలా ఉంటే టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బిజెపిపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తే టిడిపి నేతలు ఎందకు స్పందించలేదని బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సమావేశంలో ప్రశ్నించారని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp, Bjp MLA's decided to fight in Assembly against governament.Tdp, Bjp Mla's coordintaion meeting held at Golconda hotel on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి