చంద్రబాబు తాజా నిర్ణయం - రేవంత్ కు బిగ్ షాక్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో తిరిగి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు తెలంగాణ వేదికగా రాజకీయ పావులు కదుపుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఏపీలో చంద్రబాబుది అదే లక్ష్యం. దీనికి రెండు పార్టీల పరస్పర సహకారం అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం కేసీఆర్ వర్సస్ మోదీ అన్నట్లుగా తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి.
చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు
ఈ సమయంలో బీజేపీకి స్నేహ హస్తం అందిస్తే..ఏపీలో తమకు అది పరోక్షంగా సహకరించే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నాయకత్వం అంచనా వేస్తోంది. అందులో భాగంగా.. తెలంగాణ పార్టీ బలోపేతం పైన చంద్రబాబు ఫోకస్ పెట్టారు. కాసానికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. పార్టీ వీడిన నేతలను తిరిగి రావాలంటూ ఆహ్వానించారు. మీ పార్టీ మీరే నడుపుకోండి అంటూ కొత్త నినాదం వినిపించారు. ఈ దిశగా టీడీపీలో గతంలో యాక్టివ్ పని చేసి.. ఇతర పార్టీల్లో చేరి..అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్న నేతలతో మంతనాలు మొదలయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరం పైన వ్యూహాలు సిద్దం అవుతున్నాయి. హైదరాబాద్ లో టీడీపీ .. ప్రత్యేకంగా చంద్రబాబు ముద్ర ఉంటుందని..అది తమకు కలిసి వస్తుందని టీడీపీ లెక్కలు వేస్తోంది.

తెలంగాణ టు ఏపీలో అధికారం కోసం
ఎన్నికల నాటికి తమ సత్తా తిరిగి చాటేలా ముందుకెళ్లాలనేది చంద్రబాబు వ్యూహం. టీడీపీ ఏపీలో అధికారం కోసం తెలంగాణ వేదికగా పావులు కదుపుతోంది. ఇప్పుడు ఇది టీపీసీసీ చీఫ్ రేవంతకు సవాల్ గా మారుతోంది. గతంలో టీడీపీలో పని చేసిన రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే సమయంలో..టీడీపీ నుంచి పలువురు రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ లోకి వచ్చారు. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో కారణాల వలన టీడీపీలోనే ఉంటున్నా.. అక్కడ పార్టీ బలహీన పడటంతో పరోక్షంగా రేవంత్ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి రేవంత్ విజయానికి సహకారం అందించారు. ఇప్పుడు తెలంగాణలో తిరిగి టీడీపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తే..అది వ్యక్తిగతంగా ఖచ్చితంగా రేవంత్ పైన ప్రభావం పడుతుందనే అంచనాలు ఉన్నాయి.
రేవంత్ పైన చంద్రబాబు నిర్ణయం ఎఫెక్ట్
2018 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత - కాంగ్రెస్ తో జత కట్టటం తో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు నష్టం జరిగింది. చంద్రబాబు - కాంగ్రెస్ మైత్రికి సీఎం కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకున్నారు. తెలంగాణలో టీడీపీ బలహీనపడినా..ఆ పార్టీ సానుభూతి పరులు మాత్రం హైదరాబాద్ తో సహా పొరుగు జిల్లాల్లో ప్రభావం చూపించే స్థాయిలో ఉన్నాయి. మునుగోడు ఫలితం తరువాత కాంగ్రెస్ భవిష్యత్ పైన మరిన్ని చర్చలు మొదలయ్యాయి. అయితే, ఇప్పుడు చంద్రబాబు తెలంగాణ వేదికగా తీసుకుంటున్న నిర్ణయాలు..వ్యక్తిగతంగా రేవంత్ మద్దతు పైన మద్దతు చూపిస్తుందనే చర్చ నడుమ..ఈ పరిణమాలు ఎటువంటి సమీకరణాలకు కారణమవుతాయో చూడాలి.












Click it and Unblock the Notifications