బీఆర్‌ఎస్‌లో మరో ధిక్కారస్వరం: టికెట్ ఇవ్వకుంటే కారు దిగేస్తా; తీగల కృష్ణారెడ్డి అల్టిమేటం!!
తెలంగాణ రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ పార్టీలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పార్టీ నుండి టికెట్ ఆశించిన నాయకులు తమకు టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగి పోతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్ లోకి తీసుకువచ్చి తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుంటే కారు దిగటం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. తాను కెసిఆర్ తో సమానంగా రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేసిన ఆయన తనకు టికెట్ ఇవ్వకపోతే కచ్చితంగా తేడా వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేశారు.

అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కనపెట్టి, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పట్టం కడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రా రెడ్డిని పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారని ఆయన విమర్శలు గుప్పించారు.
ఇక వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పై మాట్లాడిన ఆయన తమ కోడలు డాక్టర్ అనిత రెడ్డి రంగారెడ్డి జెడ్పి చైర్ పర్సన్ గా ఉండటంతో ఒకే ఇంట్లో రెండు పదవులు కుదరవని చెబుతున్నారన్నారు. కానీ ఆ నిర్ణయాన్ని తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చాలామంది పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారందరినీ పిలిచి మాట్లాడాలని లేకపోతే తమదారి తాము చూసుకుంటామని తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఇక టికెట్ ఇవ్వకపోతే పార్టీని వదిలి వెళతాం అని చెబుతున్న తీగల కృష్ణారెడ్డి ఏ పార్టీలోకి వెళ్తామన్నది మాత్రం చెప్పలేదు. అయితే కాంగ్రెస్ నుండి తమకు ఎటువంటి పిలుపు రాలేదని, కెసిఆర్ నిర్ణయం మార్చుకోకపోతే తాము కారు దిగి పోతామని స్పష్టం చేశారు. ఇక తీగల కృష్ణారెడ్డిలా తీవ్ర అసహనంతో ఉన్న నేతలు కూడా బిఆర్ఎస్ పై, అధినేత కేసీఆర్ పై ధిక్కార స్వరం వినిపించడానికి రెడీ అవుతున్నారని సమాచారం.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications