రేవంత్ సర్కార్ GOOD NEWS.. ఇక తెల్లవార్లూ పండగే..

రాష్ట్రంలోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసబెట్టి గుడ్ న్యూస్ లు వినిపిస్తోంది. రంజాన్ మాసం సందర్భంగా ఇటీవల ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. అయితే తాజాగా మరో శుభవార్త తెలిపింది. రంజాన్ మాసం సందర్భంగా ఈ నెలరోజులపాటు దుకాణాలు 24 గంటలు తెరుచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీచేశారు.

24 గంటల పాటు..

రంజాన్ మాసం సందర్భంగా.. మార్చి 2 నుంచి 31వ తేదీ వరకు 24 గంటల పాటు షాపులు తెరుచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు దుకాణాదారులకు తెలంగాణ కార్మిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ముస్లింలకు ప్రత్యేక వెసులుబాటు కలగనుంది. అంతేకాక ఉపవాసం ముగించుకుని రాత్రి పూట ఇఫ్తార్ విందుల్లో పాల్గొనేవారికి సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Telangana Allows Shops to Stay Open 24 Hours During Ramzan Clarifies Labor Department

జీతాలు డబుల్..

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటల కంటే ఎక్కువ పనిచేసే సిబ్బందికి జీతాలు రెండింతలు ఇవ్వాలని నిశ్చయించింది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. జీవో 476ను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశించారు. రంజాన్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ పండుగలకు ఒకలా.. ముస్లిం పండుగల పట్ల మరొకలా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+