జీవో నెం 111 రద్దు; వీఆర్ఏల క్రమబద్ధీకరణ: తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు

తెలంగాణ క్యాబినెట్ ఈరోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీష్ రావు మీడియాకు వెల్లడించారు. 111 జీవో ని ఎత్తివెయ్యాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణ నూతన సచివాలయం లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది . 3గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 6 గంటల 15 నిమిషాల వరకూ కొనసాగింది.

దాదాపు మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ క్యాబినెట్ భేటీలో దశాబ్ది వేడుకలతో పాటు పలు కీలక అంశాల పైన సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. ఈ సమావేశానికి మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. జూన్ రెండవ తేదీ నుండి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

telangana cabinet sensational decisions: Repeal of GO No. 111 and regularization of VRAs

నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై పిడియాక్ట్ పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు మంత్రివర్గ భేటీలో కుల వృత్తుల బలోపేతం కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డీఎంహెచ్వో పోస్టుల మంజూరు తో పాటు కొత్తగా 40 మండలాలలో పీహెచ్సీల ను మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జైన్ కమ్యూనిటీని మైనారిటీ కమిషన్ పరిధిలోకి తీసుకురావడానికి కేబినెట్ నిర్ణయించింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పది కొత్త పోస్టులు మంజూరు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీఆర్ఏ ల ను క్రమబద్ధీకరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 111 జీవో ని ఎత్తివేయాలని ఈ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని ఆయన తెలిపారు. హెచ్డిఎంఏ పరిధి విధివిధానాలనే జీవో111 గ్రామాలకు వర్తింప చేస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

జీవో నెంబర్ 111 ను ఎత్తివేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో 84 గ్రామాలకు ఊరట కలుగుతుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. హుస్సేన్ సాగర్ ను కాళేశ్వరం తో అనుసంధానం చేస్తామని, శంకరపల్లి, చేవెళ్ల రహదారులను వెడల్పు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 33 జిల్లాలో 33 మంది డీఎంహెచ్వో లను నియమించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+