'సిస్కో'తో ఎంఓయు: కేటీఆర్ ఆశ నెరవేరుతుందా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరవాసులకు మెరుగైన సేవలు అందించాలని, నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు మంత్రి కేటీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సంకల్పించారు. ఇందులో భాగంగా స్మార్ట్‌సిటీ ప్రణాళికలపై ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'సిస్కో'తో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదిరింది.

మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సిస్కో ఇండియా ఎండీ పురుషోత్తమ్ కౌషిక్‌లు ఈ ఎంఓయుపై సంతకాలు చేశారు. దీంతో, స్మార్ట్‌సిటీ సొల్యూషన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మార్గం సుగమనమైంది.

గతేడాది తొలిసారిగా సిస్కో స్మార్ట్ సిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగంలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఎంఓయును కుదుర్చుకుని ఇప్పటికే టీ-హబ్‌తో కలిసి పనిచేస్తోంది. తాజాగా పైలెట్ ప్రాజెక్టులో భాగంగా హైటెక్ సిటీ ప్రాంతంలో స్మార్ట్‌సిటీ సోల్యూషన్స్ ద్వారా పలు సదుపాయాలు కల్పించనుంది.

'సిస్కో'తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు

'సిస్కో'తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు

ముఖ్యంగా స్మార్ట్ వైఫై, స్మార్ట్ పార్కింగ్, స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్, స్మార్ట్ కియోస్క్‌లు, సిటిజెన్ సేవల పోర్టల్, సిటిజన్ యాప్ వంటి అంశాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్టును చేపట్టనుంది. వీటివల్ల సమాజం మీద, అదేవిధంగా మన ప్రజల మీద ఎలాంటి ప్రభావం పడనున్నదనే అంశంపై లోతుగా అధ్యయనం చేయనున్నారు.

'సిస్కో'తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు

'సిస్కో'తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు

'కొన్నాళ్ల పాటు పైలట్ ప్రాజెక్టు ఫలితాలను ప్రభుత్వ అధికారులు క్షుణ్నంగా అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానంలో చేయాల్సిన మార్పులు, చేర్పులను సూచిస్తారు. అంతిమంగా, నగరంలోని పలు ప్రాంతాల్లోకి ఈ సేవలను విస్తరించే అవకాశం ఉంటుంది' అని సిస్కో ప్రతినిధిలు వెల్లడించారు.

'సిస్కో'తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు

'సిస్కో'తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు

నగరవాసులు నిత్యం అందుకునే సేవలన్నింటినీ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసి.. ప్రజల జీవన విధానాన్ని సాఫీగా సాగేలా చేయడానికి ప్రభుత్వం ముందు నుంచీ ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, పలు అభివృద్ధి చెందిన దేశాల్లో పౌర సేవలన్నీ మొబైల్ ద్వారా అందిస్తున్నాయి.

'సిస్కో'తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు

'సిస్కో'తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు

కార్లలో ప్రయాణం చేసేవారికి.. ఏయే ప్రాంతాల్లో కార్లను పార్కింగ్ చేసుకోవడానికి ఖాళీ ఉంది? ఏయే రహదారులన్నీ ట్రాఫిక్‌తో రద్దీగా ఉన్నాయో లాంటి సమాచారమంతా మొబైల్‌కే ముందుగానే అందుతుంది. తద్వారా అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తుంటారు.

'సిస్కో'తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు

'సిస్కో'తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు

అదేవిధంగా పలు విదేశీ నగరాల్లో పౌర సేవలన్నింటినీ ఆధునిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడం వల్ల.. అక్కడి ప్రజల జీవన విధానంలోనూ పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఇదే తరహాలో హైదరాబాద్ నగర వాసులకు అత్యాధునిక సేవలను అందించడానికి 'సిస్కో'తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The state government on Thursday signed an MoU with Cisco Systems to develop Hyderabad as a smart city. The smart city programme will be implemented as a pilot project.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి