వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ పై కీలకఅడుగు.. నేరవేరనున్న దశాబ్దాల కల!!
వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. మామునూరు విమానాశ్రయ ఏర్పాటుపై కీలక అడుగు పడింది. నిన్న రాష్ట్ర మంత్రివర్గం వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్, ప్రస్తుత రన్‌వే పొడిగింపు కోసం 253 ఎకరాల అదనపు స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్ట్ కు చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1930 సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఎయిర్పోర్ట్ తర్వాత నిజాం పాలనలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారత వైమానిక దళానికి ఎంతగానో ఉపయోగపడింది. అప్పట్లో వర్తక వాణిజ్యాలకు మామునూరు ఎయిర్పోర్ట్ ఉపయోగపడింది. 1981 సంవత్సరంలో మామునూరు ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వ 2018 నుండి చురుగ్గా పనిచేస్తుంది. వరంగల్ జిల్లా వాసులు అనేకమార్లు మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. వడివడిగా అడుగులు పడుతున్న మామునూరు ఎయిర్ పోర్ట్ కు ఇప్పటికే ఈ సంవత్సరం విమానాశ్రయ విస్తరణ కోసం అదనపు భూమిని సేకరించేందుకు సర్వే పూర్తి చేయగా ఖిల్లా వరంగల్ మండలంలో త్వరలోనే భూసేకరణ చేయనున్నారు.
విమానాశ్రయం విస్తరణకు ఖిల్లా వరంగల్ మండలంలోని నక్కలపల్లి, గాడేపల్లి, మామునూరు గ్రామాల నుంచి విమానాశ్రయ అభివృద్ధికి కొన్ని భూములను గుర్తించారు. వాటిని సేకరించాలని నిర్ణయించారు. ప్రతిఫలంగా రైతులకు వేరే చోట భూములను కేటాయించనున్నారు. రైతుల భూములను సేకరించి ఎయిర్పోర్ట్ అథారిటీ కి బదిలీ చేస్తారు. తద్వారా ప్రస్తుత 1.8 కి.మీ రన్‌వేని 3.9 కి.మీకి విస్తరించడానికి వీలు దొరుకుతుంది.
ఆపై బోయింగ్ 747 వంటి పెద్ద విమానాలకు కూడా మామునూరు ఎయిర్పోర్ట్ కు రావడానికి వెసులుబాటు దొరుకుతుంది. వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ జరిగితే చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు విమాన కనెక్టివిటీ అందుతుందని, కాకతీయ టెక్స్టైల్ పార్కు కు, వ్యాపార వృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని వరంగల్ జిల్లా వాసులు చెబుతున్నారు. వరంగల్లో పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న క్రమంలో పర్యాటకులను పెద్దసంఖ్యలో ఆకర్షించటానికి కూడా ఎయిర్పోర్ట్ దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications