హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్: పర్యటన షెడ్యూల్ ఇదీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీఎం కేసీఆర్ చైనాలోని డాలియన్‌కు చేరుకున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చైనా పర్యటన సాగుతోంది. పది రోజుల పర్యటన నిమిత్తం సోమవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చైనాకు బయలుదేరారు.

50 సీట్లు కలిగిన బొండార్డియర్ CRJ-100 ఎయిర్‌క్రాఫ్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం రూ. 2 కోట్లకు అద్దెకు తీసుకుంది. ఎంటర్టైన్మంట్ సెంటర్‌తో పాటు లగ్జరీ ఇంటీరియర్స్ ఈ ఎయిర్‌క్రాప్ట్‌ సొంతం. డాలియన్‌లో ఆయన షాంగ్రిల్లా హోటల్‌లో బస చేయనున్నారు.

చైనాలోని డాలియన్ నగరంలో ఈనెల 9 నుంచి 11 వరకు 'న్యూ ఛాంపియన్స్' పేరిట జరుగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరమ్ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడులు, భారీ పరిశ్రమల సాధనే లక్ష్యంగా చైనాలో ఆయన పర్యటన సాగుతుంది.

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్


సెప్టెంబర్ 7:
* రాత్రి 8 గంటలకు డాలియన్ నగరానికి చేరుకున్న సీఎం కేసీఆర్ రాత్రికి డాలియన్ సిటీలోని షాంగ్రిల్లా హోటల్‌కు బస చేస్తారు.

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్


సెప్టెంబర్ 8:
* 8వ తేదీన స్ధానిక ప్రముఖులతో మాట్లడాతారు. రాత్రి 8 గంటల నుంచి 8. 30 గంటల వరకు ఎన్నారైలతో కలిసి డిన్నర్ చేస్తారు.

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్


సెప్టెంబర్ 10:
* డాలియన్ నుంచి షాంఘై చేరుకుంటారు. నగరంలోని మారియట్ హోటల్ సిటీ సెంటర్‌లో బస చేస్తారు.
* మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకును సందర్శిస్తారు.
* సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు చైనా పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.
* తెలంగాణ ప్రభుత్వం తరఫున చైనా పారిశ్రామికవేత్తలకు విందు ఇస్తారు.

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్


సెప్టెంబర్ 11:
* షాంఘైలోని సొఝు పారిశ్రామిక పార్క్‌లో సీఎం పర్యటిస్తారు.
* అక్కడే స్థానిక పారిశ్రామికవేత్తలతో కలిసి భోజనం చేస్తారు.
* అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు బీజింగ్ నగరం చేరుకొని రఫెల్స్ హోటల్‌లో బస చేస్తారు.
* అదే హోటల్ చైనాలో భారత రాయబారి ఇచ్చే విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు.

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్


సెప్టెంబర్ 12:
* ఉదయం 10 నుంచి 10.25 గంటలవరకు చైనా రైల్వే కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు.
* 10.30 గంటల నుంచి 10.55 గంటలవరకు చాంగ్‌క్వింగ్ ఇంటర్నేషనల్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (సీఐసీవో) ప్రతినిధులతో సమావేశమవుతారు.
* 11గంటల నుంచి 11.45 వరకు ఇన్స్‌పూర్ గ్రూప్‌తో, మధ్యాహ్నం 12.35 నుంచి ఒంటిగంట వరకు గ్రీన్‌సిటీ ఈ-3 లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమవుతారు.
* సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సాని సంస్థ ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమవుతారు.

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్


సెప్టెంబర్ 13:
* చైనా మహాకుడ్యాన్ని సీఎం సందర్శిస్తారు.
* సాయంత్రం 4.30 గంటలకు షెంజన్‌కు చేరుకుంటారు.

 పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్


సెప్టెంబర్ 14:
* ఉదయం 11.30 గంటలకు షెంజన్ (ఇండస్ట్రియల్) హైటెక్ పార్క్‌కు చేరుకొని సాయంత్రం 4గంటలవరకు అక్కడి పరిశ్రమలను పరిశీలించి స్థానిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడతారు.
* అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు హాంకాంగ్ చేరుకుంటారు.

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్


సెప్టెంబర్ 15:
* ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రినాయిసెన్స్ హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశమై అక్కడే భోజనం చేస్తారు.
* మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్నేషనల్ కామర్స్ సెంటర్‌కు చేరుకొని అక్కడి స్కై 100 అబ్జర్వేషన్ డెక్‌ను సందర్శిస్తారు.
* మధ్యాహ్నం 3.15 గంటలకు లాంగ్టావ్‌లోని బిగ్ బుద్ధను సందర్శిస్తారు.
* తిరిగి రాత్రి 7 గంటలకు భారత రాయబారి ఇచ్చే విందులో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

 పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్

సెప్టెంబర్ 16:
మధ్యాహ్నం ఒంటిగంటకు హాంకాంగ్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

 పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్

పెట్టుబడుల వేటలో చైనాకు కేసీఆర్


చైనా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు కేకే, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జీ జగదీశ్‌రెడ్డి, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాశ్‌రెడ్డి, జంగినపల్లి సంతోశ్‌కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఐజీ భగవత్ మహేశ్‌మురళీధర్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, మిషన్ మేనేజర్లు జగదీశ్ రామడుగు, శివాని శంకర్ (సీవీఎస్)లతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు వెళ్లారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao on Monday left for a 10-day visit to China to attract investment and also to address a meeting of the World Economic Forum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X