Revanth Reddy: నాకోసం వాళ్లను ఆపొద్దు-పోలీసులకు రేవంత్ రెడ్డి సూచన..!

తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ముఖ్యంగా పాలనకు సంబంధించిన అంశాలపై తన మార్కు ఉండేలా చూసుకుంటున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు జనం కోణంలోనూ పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై తన కాన్వాయ్ వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.

తాను ఇంటి నుంచి బయలుదేరడానికి చాలాసేపు ముందే వాహనాలను పోలీసులు నిలిపివేయడంపై రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై అలా ముందస్తుగా ఎక్కువసేపు వాహనాలను నిలిపివేయొద్దని పోలిసుల్ని ఆయన ఆదేశించారు. ఇలా వాహనాలు ఎక్కువసేపు రోడ్లపై నిలివేయడం వల్ల హైదరాబాద్ నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. కాబట్టి వారికి మినహాయింపులు కల్పించే విషయంలో పోలీసులు ఆలోచించాలని సూచించారు.

telangana cm revanth reddy suggest police not to stop vehicles for his convoy much before

సీఎం రేవంత్ రెడ్డి సూచనతో పోలీసు అధికారులు ఇప్పుడు ఈ అంశంపై దృష్టిసారించారు. ట్రాఫిక్ నిబంధనల విషయంలో వాహనదారులకు వెసులుబాట్లు ఇచ్చే విషయంలో పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం కోరిన విధంగా తాను బయలుదేరడానికి చాలా సేపు ముందు కాకుండా అప్పటికప్పుడు వాహనాలను నియంత్రించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా వాహనదారుల ఇబ్బందుల్ని కాస్తయినా తగ్గించవచ్చని భావిస్తున్నారు. సీఎం రేవంత్ ఆదేశాల నేపథ్యంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+