Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో కౌంటింగ్ ఏర్పాట్లు.. లెక్కింపు కేంద్రాలు ఇవే

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 11న మంగళవారం విడుదల కానున్నాయి. దీనికోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 31 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలు :

1) కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని 2 నియోజకవర్గాలకు సంబంధించి "సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ ఆసిఫాబాద్" లో ఓట్ల లెక్కింపు

జరగనుంది.

2) మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "ఏఎంసి గోదాం, మంచిర్యాల" లో జరగనుంది.

3) ఆదిలాబాద్ జిల్లాలోని 2 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్‌మెంట్ సెంటర్, ఆదిలాబాద్" లో జరగనుంది.

4) నిర్మల్ జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు "పాలిటెక్నిక్ కాలేజీ, నిర్మల్

" కేంద్రంలో నిర్వహించనున్నారు.

5) నిజామాబాద్ జిల్లాలోని 6 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, నిజామాబాద్" లో జరగనుంది.

Telangana Counting Centres List

6) కామారెడ్డి జిల్లాలోని 3 నియోజవర్గాలకు సంబంధించిన ఓట్ లెక్కింపు "ఏఎంసి గోదాం, కామారెడ్డి" లో నిర్వహించనున్నారు.

7) జగిత్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "వీఆర్‌కే ఎడ్యుకేషన్ సొసైటీ, జగిత్యాల" లో జరగనుంది.

8) పెద్దపల్లి జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ "JNTUH,మంథని

" లో నిర్వహించనున్నారు.

9) కరీంనగర్ జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కాలేజీ, కరీంనగర్" లో జరగనుంది.

10) రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 2 నియోజకవర్గాలకు గాను ఫలితాల కౌంటింగ్ "సోషల్ వెల్ఫేర్ స్కూల్, తంగళ్ళపల్లి, సిరిసిల్ల" లో జరగనుంది.

11) సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాల కౌంటింగ్ "గీతం యూనివర్సిటీ, సంగారెడ్డి" లో జరగనుంది.

12) మెదక్ జిల్లాలోని 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు "వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెదక్" ప్రాంగణంలో జరగనుంది.

13) సిద్దిపేట జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "ఇందూరు ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిద్దిపేట" లో నిర్వహించనున్నారు.

14) రంగారెడ్డి జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించి ఒక చోట, మరో 4 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ మరో చోట్ నిర్వహించనున్నారు.
ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, షాద్ నగర్ ఈ 4 నియోజకవర్గాలకు గాను "బీసీ రెసిడెన్షియల్ స్కూల్, పాలమాకుల" లో కౌంటింగ్ జరగనుంది.

రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, కల్వకుర్తి ఈ 4 నియోజకవర్గాల కౌంటింగ్ "ట్రైబల్ వెల్ఫైర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ, పాలమాకుల" లో జరగనుంది.

15) వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు "అగ్రికల్చర్ మార్కెట్ గోదాం, వికారాబాద్" లో నిర్వహించనున్నారు.

16) మేడ్చల్ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీ, కీసర" లో జరగనుంది.

17) హైదరాబాద్ జిల్లా పరిధిలోని (15) నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో కింది విధంగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

  • ముషీరాబాద్, నాంపల్లి నియోజకవర్గాల కౌంటింగ్ - ఎల్బీ స్టేడియం
  • మలక్ పేట సెగ్మెంట్ - జీహెచ్ఎంసీ గ్రౌండ్స్, అంబర్ పేట
  • అంబర్ పేట సెగ్మెంట్ - రెడ్డి కాలేజీ, నారాయణగూడ
  • ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ - కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, యూసుఫ్ గూడ
  • సనత్ నగర్ సెగ్మెంట్ - ఓయూ కామర్స్ బిల్డింగ్
  • తార్నాక, కార్వాన్ - ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్
  • గోశామహాల్ నియోజకవర్గం - కోఠి ఉమెన్స్ కాలేజీ ఆడిటోరియం, కోఠి
  • చార్మినార్ - కమలా నెహ్రు పాలిటెక్నిక్ కళాశాల, ఎగ్జిబిషన్ గ్రౌండ్
  • నాంపల్లి, చాంద్రాయణగుట్ట - నిజాం కాలేజీ
  • యాకుత్ పుర - సరోజిని నాయుడు కాలేజీ, నాంపల్లి
  • బహదూర్ పుర - సాంకేతిక విద్య భవన్, మాసబ్ ట్యాంక్
  • సికింద్రాబాద్ - పీజీఆర్ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓయూ
  • కంటోన్మెంట్ - సీఎస్ఐఐటీ, వెస్లీ కాలేజ్

18) మహబూబ్ నగర్ జిల్లాలో 5 నియోజకవర్గాలున్నాయి. అందులో నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల సెగ్మెంట్ లకు సంబంధించిన కౌంటింగ్ - "జేపీ ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియం ధర్మాపుర్" లో జరగనుంది.

దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ- జేపీ కాలేజీ, అబ్దుల్ కలాం బిల్డింగ్ లో నిర్వహించనున్నారు.

19) నాగర్ కర్నూల్ జిల్లాలోని 3 నియోజకవర్గాలకు గాను "అగ్రికల్చర్ మార్కెట్ యార్డు, నెల్లికొండ" లో కౌంటింగ్ జరగనుంది.

20) వనపర్తి జిల్లాలోని 1 సెగ్మెంట్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు "న్యూ అగ్రికల్చర్ మార్కెట్ బిల్డింగ్, వనపర్తి" లో నిర్వహించనున్నారు.

21) జోగులంబా గద్వాల జిల్లాలోని 2 సెగ్మెంట్ల కౌంటింగ్ "ఓల్డ్ బిల్డింగ్, ఎస్కేటీఆర్ కాలేజ్, గద్వాల" లో జరగనుంది.

22) నల్గొండ జిల్లాలోని 6 నియోజకవర్గాలకు గాను ఓట్ల లెక్కింపు ప్రక్రియ "టీఎస్ హౌసింగ్ వేర్ హౌస్ కార్పొరేషన్, దుప్పల్లాపల్లి" లో జరగనుంది.

23) సూర్యాపేట జిల్లాలోని 4 సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ "ఏఎంసి గోదాం, సూర్యాపేట" లో నిర్వహించనున్నారు.

24) యాదాద్రి జిల్లాలోని 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు "అరోరా ఇంజినీరింగ్ కాలేజీ, భువనగిరి" లో జరగనుంది.

25) జనగామ జిల్లాలోని 3 సెగ్మెంట్ల కౌంటింగ్ "వీబీఐటి, పెంబర్తి" లో జరగనుంది.

26) మహబూబాబాద్ జిల్లాలోని 2 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు "ఫాతిమా హై స్కూల్, మహబూబాబాద్" లో నిర్వహించనున్నారు.

27) వరంగల్-రూరల్ జిల్లాలోని 2 సెగ్మెంట్ల కౌంటింగ్ "ఏఎంసి యార్డు, ఏనుమాముల" లో జరగనుంది.

28) వరంగల్ - అర్బన్ జిల్లాలోని 3 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ "MLS గోదాం, ఎనుమాముల లో నిర్వహించనున్నారు.

29) భూపాలపల్లి జిల్లాలోని 2 నియోజకవర్గాలకు గాను కౌంటింగ్ "అంబేద్కర్ స్టేడియం, భూపాలపల్లి

" లో జరగనుంది.

30) కొత్తగూడెం జిల్లాలోని 5 సెగ్మెంట్ లకు సంబంధించిన కౌంటింగ్ "అనుబోసు ఇంజినీరింగ్ కాలేజీ, పాల్వంచ"లో నిర్వహించనున్నారు.

31) ఖమ్మం జిల్లాలోని 5 సెగ్మెంట్లకు గాను ఓట్ల లెక్కింపు "విజయ ఇంజినీరింగ్ కాలేజీ, ఖమ్మం" నందు నిర్వహించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+