దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబు: జూన్ 2న ట్యాంక్ బండ్‌పై కార్నివాల్
తెలంగాణ రాష్ట్రం పదేళ్ల ఆవిర్భావ వేడుకలకు ముస్తాబవుతోంది. జూన్ 2న ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం డీజీపీ రవిగుప్తాతో కలిసి పరేడ్ గ్రౌండ్ వెళ్లిన సీఎస్ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీసుల కవాతు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున స్టేజిని సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులను సన్మానించనున్నారు.

సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్న విషయం తెలిసిందే. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించనున్న సీఎం పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కోసం పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు పరేడ్ మైదానంలో రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆకర్షించే పోలీస్ కవాత్ కోసం రక్షకభటులు వారం రోజల పాటు రిహార్సల్స్ చేస్తున్నారు. ఇందులో అక్టోపస్ బలగాలు, టీఎస్ఎస్పీ బెటాలియాన్, ఏఆర్, కార్ హెడ్ క్వార్టర్స్ పోలీసులతో పాటు విద్యార్థులు పాల్గొంటున్నారు.
జూన్ 2 కార్యక్రమాల షెడ్యూల్ ఇలా
జూన్ 2న జరిగే కార్యక్రమాల షెడ్యుల్‌ను సీఎస్ శాంతి కుమారి నిర్ణయించారు. ఆరోజు ఉదయం గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళి సీఎం రేవంత్ అర్పించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకల్లో పాల్గొని రాష్ట్ర గీతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ట్యాంక్ బండ్‌పై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కళారూపాల కార్నివాల్, ఏర్పాటు చేయనున్నారు. హస్త, చేనేత కళలు, స్వయం సహాయక బృందాలతో పాటు హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్ల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 5 వేల మంది శిక్షణ పోలీసుల బ్యాండ్ ప్రదర్శన ఉండనుంది. సాయంత్రం సందర్శకులను ఆకట్టుకునేలా బాణసంచా, లేజర్ షో జరగనుంది.












Click it and Unblock the Notifications