TS SI, Conistable Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల..
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలను విడుదల చేశారు. సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 98,218 మంది క్వాలిఫై అయ్యారు. ఐటీ &కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు 4564మందికి అర్హత సాధించారు. సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 43,708 మంది అభ్యర్థులు అర్హత పొందారు.
ఐటీ &కమ్యుూనికేషన్ ఎస్‌ఐ పోస్టులకు 729 మంది అర్హత సాధించారు. డ్రైవర్, ఆపరేట్ కానిస్టేబుల్ పోస్టులకు 1779 మంది క్వాలిఫై అయ్యారు. ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్‌ఐ పోస్టులకు 1,153 మంది అర్హత పొందారు. పోలిస్ ట్రాన్స్‌పోర్ట్ ఎస్ఐ పోస్టులకు 463 మంది అర్హత సాధించారు. కానిస్టేబుల్ మెకానిక్ పోస్టులకు 238 మంది అర్హత పొందారు.













Click it and Unblock the Notifications