ఎన్నికల ఎఫెక్ట్ : భాగ్యనగరంలో ఖాళీగా మెట్రో రైళ్ళు; కిటకిటలాడుతున్న బస్సులు!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్ నేపథ్యంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఓటు వేయడానికి నగరవాసులు అంతా గ్రామాల బాట పట్టారు. మొన్నటి నుండి బస్టాండ్లు వివిధ ప్రాంతాలకు వెళ్లే వారితో కిటకిటలాడుతున్నాయి. ఇక నేడు కూడా బస్టాండ్లలో విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. జీవనోపాధి కోసం నగరాలకు వలస వచ్చిన చాలామంది తమ సొంత గ్రామాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఇక ప్రజలంతా ఓట్లు వేయడానికి గ్రామాల బాట పట్టడంతో హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది. హైదరాబాదులో ఉన్న వారు దాదాపు స్వగ్రామాలకు వెళ్లడంతో హైదరాబాద్ మహానగరం బోసిపోయింది. ఇక ప్రతిరోజు హైదరాబాద్ మహానగరంలో కిటకిట లాడుతూ ఉండే మెట్రో రైళ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈరోజు హైదరాబాద్లోని మెట్రో రైళ్ళు కరోనా కాలం నాటి పరిస్థితులను తలపిస్తున్నట్టు ఉన్నాయి.

Telangana Election effect: Metro trains empty in Hyderabad; rush in buses!!

ఉద్యోగస్తులతో నిత్యం రద్దీగా ఉండే మెట్రో రైళ్లలో నిత్య చాలామంది నిలబడే తమ గమ్య స్థానాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. కొద్దిగా లోని ప్రయాణికులు ఉండడం ప్రధానంగా కనిపిస్తుంది. ఈరోజు హైదరాబాద్లో మెట్రో రైలు లో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పే ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళుతున్న ఓటర్లు, బస్సులో ప్రయాణికులు కిటకిటలాడుతున్న క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలామంది బస్సు పైకి ఎక్కి, ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేస్తూ కూడా ఇళ్లకు వెళుతున్నారు. ఉప్పల్ వద్ద ఇలాంటి సీన్లు కనిపిస్తున్నాయి.

మరోవైపు ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓటు వెయ్యటానికి సొంత గ్రామాలకు వెళుతూ ప్రయాణాలు చేస్తున్న వారికి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ఉన్న కొద్ది బస్సుల్లోనే నానా తంటాలు పడుతూ ప్రయాణాలు చేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ లకు భారీగా ప్రజలు తరలి వెళుతున్న క్రమంలో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ లు చోటుచేసుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+