తెలంగాణ ఎన్నికల ఫలితాలు: తొలిగా బోణీ కొట్టిన కాంగ్రెస్, అశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం!!
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలలో, టిఆర్ఎస్ 29 స్థానాల్లో, బిజెపి ఆరు స్థానాలలో ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. హోరాహోరీగా జరుగుతున్న పోరులో చాలా నియోజకవర్గాలలో బిజెపి కాంగ్రెస్ల మధ్య, టిఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య ప్రచ్చన్న సమరం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ లో తొలి ఫలితం వెలువడింది.
అశ్వరావుపేట లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు. 28358 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అధికారికంగా ఈయన విజయాన్ని ప్రకటించాల్సి ఉంది. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల పోరులో తొలి ఫలితం లోనే మొదట కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అశ్వరావుపేట లో సంబరాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన మెచ్చా నాగేశ్వరరావు పై జారే ఆదినారాయణ విజయం సాధించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లలోను ఆధిక్యాన్ని కొనసాగించిన ఆదినారాయణ, ఈవీఎంల కౌంటింగ్ లోను దూసుకుపోయారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈసారి ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీకి పరాభవం ఎదురు కాబోతుంది. ఖమ్మం జిల్లాలో చాలా స్థానాలలో కాంగ్రెస్ ఎదురీదుతుంది. చాలా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓటమి అంచున కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈసారి మార్పు వైపే అడుగులు వేసినట్టు తాజా ఫలితాలతో అర్థమవుతుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications