కొండా సురేఖ ఘనవిజయం; వరంగల్ తూర్పు కోటపై ఎగిరిన కాంగ్రెస్ జెండా!!

తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గం. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ఎన్నికల పోరు ఆద్యంతం ఉత్కంఠను కొనసాగించింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ, అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బిజెపి అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎన్నికల బరిలోకి దిగి రాజకీయాలను హీటెక్కించారు.

వరంగల్ జిల్లాలో చాలా ఆసక్తిగా అందరూ దృష్టి సారించిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది వరంగల్ తూర్పు నియోజకవర్గమే.ఇక ఈరోజు ఎన్నికల ఫలితాలలో కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గం పై ప్రత్యేకమైన ఆసక్తిని అందరూ కనబరిచారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగించింది.

Telangana elections: Konda Surekha won..Congress victory in Warangal east!!

ఒక దిశలో బిజెపి అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండ సురేఖ వరంగల్ కోటపై కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు. వరంగల్ తూర్పు నుండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొండా సురేఖ విజయం సాధించారు.తన సమీప ప్రత్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై 15,043 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నన్నపనేని నరేందర్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు.

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నన్నపనేని మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. వరంగల్ తూర్పు నియోజవర్గం లెక్కింపు చివరి 17వ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 66,725 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 42,535 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 15,043 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.

కొండా సురేఖ విజయం సాధించడంతో కొండ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న జోష్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక కొండా సురేఖ విజయం సాధించడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండా సురేఖకు మంత్రిగా అవకాశం దక్కుతుందని ఆమె అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+