Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల: 3 విడతల్లో, ఎప్పట్నుంచంటే?

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. గురువారం ఎంసెట్(TS EAMCET) ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.

జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలు ప్రక్రియ జరగనుంది. జూన్ 26 నుంచి మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. జూన్ 26న ఆన్ లైన్‌లో కౌన్సిలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ ఉంటుంది. జూన్ 28 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన.. జూన్ 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ఉంటుంది. జులై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.

 tseamcet

జులై 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 21 నుంచి రెండో విడత ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది. జులై 21 నుంచి 24 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నడుస్తుంది. జులై 28న రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.

ఆగస్టు 2 నుంచి తుది విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఆగస్టు 7న ఇంజనీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+