తెలంగాణా ఫైర్ బ్రాండ్.. మంత్రి కొండా సురేఖ పొలిటికల్ జర్నీ!!

తెలంగాణా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ. రాజకీయాల్లో కొండా సురేఖ స్టైలే వేరు. ఏ పార్టీలో పని చేసినా వీర విధేయత చూపించే కొండా సురేఖ అంతే స్థాయిలో అవసరమైతే ధిక్కార స్వరాన్ని వినిపించారు. సుమారు పాతిక సంవత్సరాల క్రితం ఒక సాధారణ ఎంపీపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు.

రాజకీయంగా తనను ఎవరు ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు కొండ సురేఖ. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనూ కెసిఆర్ పై ధిక్కార గొంతుకను వినిపించిన కొండ సురేఖ, చారిత్రక ఓరుగల్లు పౌరుషానికి ప్రతీకగా రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా నిలిచారు.

Telangana Fire Brand.. Minister Konda Surekha Political Journey!!

ప్రస్తుతం వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొండ సురేఖ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కొండా సురేఖకు స్త్రీ శిశు సంక్షేమ శాఖను కేటాయించినట్లు గా సమాచారం. ఇక కొండా సురేఖ ప్రస్తానాన్ని చూస్తే 1965 ఆగస్టు 19వ తేదీన జన్మించిన కొండా సురేఖ వరంగల్ ఎల్బి కళాశాలలో చదువుకున్నారు.

ఎల్బీ కళాశాలలో చదువుతున్న సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కొండా మురళీధర్ రావు ని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నారు.కొండా దంపతుల ఒక్కగానొక్క కూతురు సుస్మిత పటేల్ ఆమె రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే పనిలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో కొండా సురేఖ విజయం కోసం సుస్మిత పటేల్ నిద్రాహారాలు లేకుండా శ్రమించారు.

1995లో రాజకీయాల్లోకి వచ్చిన కొండ సురేఖ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు.మొదట మండల పరిషత్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. 1999లో శాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొండా సురేఖ తొలిసారి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009 సంవత్సరాలలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Telangana Fire Brand.. Minister Konda Surekha Political Journey!!

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 లో జరిగిన ఎన్నికలలో పరకాలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ ప్రస్తుతం 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొండ సురేఖ వరంగల్ జిల్లా మంత్రిగా స్థానం దక్కించుకున్నారు.

రాజకీయాల్లో ఒడిదుడుకులను ఎన్నో చూసిన కొండా సురేఖ ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించేలా రాజకీయాలు చేయటంలో దిట్ట. నేడు ఎల్బి స్టేడియంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓరుగల్లు మంత్రిగా జిల్లాలో కాలు పెట్టబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+