ఏపీ బాటలో తెలంగాణా: వాట్సప్ తో మీ అరచేతిలోనే ప్రభుత్వ సేవలు!
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సామాన్య ప్రజలకి ముఖ్యంగా పేద వర్గాలకి ప్రభుత్వ సౌకర్యాలు మరింత చేరువ అవుతున్నాయి. మీ సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి సమయం వృథా చేసుకుంటూ..వేచి ఉండే అవసరం లేకుండా, కేవలం ఒక మెసేజ్ తో పనులు వెంటనే పూర్తయ్యే మంచి రోజులు వచ్చేశాయి.
తెలంగాణా ప్రజలకు శుభవార్త
ఏపీ సర్కార్ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలను అందించే శుభవార్త చెప్పింది. డిజిటల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ పాలనను పౌరుల అరచేతుల్లోకి తెచ్చేందుకు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఇంట్లో కూర్చునే సెల్‌ఫోన్ ద్వారానే ప్రభుత్వ సేవలు
మీ-సేవ, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ ఎవరూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో కూర్చునే సెల్‌ఫోన్ ద్వారానే ప్రభుత్వ సేవలను పొందేలా ఏర్పాట్లు చేస్తోంది.ఇందులో భాగంగా, ప్రభుత్వం తన సేవలను వాట్సాప్‌తో అనుసంధానం చేస్తోంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలూ తమతమ పౌరుల కోసం వాట్సాప్ గవర్నెన్స్ ను ఎలా అమలు చేస్తున్నాయో తెలుసుకుందాం.
ఈ చాట్ బాట్ 580 కంటే ఎక్కువ సేవలు
తెలంగాణ సర్కార్ 80969 58096 వాట్సాప్ నంబర్ తో ఈ సేవలను ప్రారంభించింది. దాదాపు 38 శాఖలకు చెందిన 580 కంటే ఎక్కువ సేవలను ఈ చాట్ బాట్ ద్వారా అందిస్తోంది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నుండి విద్యార్థుల హాల్ టికెట్ల వరకు అన్నీ సేవలూ ఇక్కడ లభిస్తాయి. ఇది సామాన్యుల విలువైన సమయం వృథా అవకుండా కాపాడటంతో పాటు.. వారి కష్టార్జితాన్ని ను కూడా ఆదా చేస్తోంది.
ఏపీలోనూ డిజిటల్ విధానం ద్వారా సేవలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం 95523 00009 నంబర్ ద్వారా మన మిత్ర పేరుతో ఈ వాట్సాప్ సేవలను ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ డిజిటల్ విధానం ద్వారా 161రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పథకాల సమాచారంతో పాటు, దేవాలయాల దర్శన టికెట్ల సమాచారం మరియు బస్సు బుకింగ్ సదుపాయాలు,పట్టాదారు పాసు పుస్తకాల వివరాలు కూడా ఉండటం విశేషం.
ప్రజా పాలనలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్
తెలుగు రాష్ట్రాల వాట్సాప్ చాట్ బాట్లు మెటా (Meta) సంస్థ సహకారంతో ఏఐ (AI) టెక్నాలజీ ను ఉపయోగిస్తున్నాయి. ప్రజలు తమకు కావలసిన భాషను ఎంచుకుని, సూచనలను ఫాలో అయిపోతే సరిపోతుంది. ధ్రువీకరణ పత్రాల పిడిఎఫ్ కాపీలు నేరుగా మీ వాట్సాప్ కే వస్తాయి. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా, కార్యాలయాల్లో మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తుంది. అవినీతిని పూర్తిగా అరికడుతుంది.
వాట్సాప్ సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు గొప్ప వరం
సాంకేతికతను సామాన్యుడి ముంగిటకు చేర్చడంలో రెండు తెలుగు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. నిరంతరం అందుబాటులో ఉండే ఈ వాట్సాప్ సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు గొప్ప వరంలా మారాయి. మీ సేవా సెంటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన బాధ తప్పింది. భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ సేవలను ఈ వేదికపైకి తీసుకురావాలని తెలుగు రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications