రాజస్థాన్ కోటల్లా ఆ కోటలు వెలిగిపోతాయ్.. పర్యాటక శాఖ బిగ్ ప్లాన్!

తెలంగాణ పర్యాటక రంగం ఆదాయ సముపార్జనతో పాటు, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేలా ప్లాన్ చేస్తోంది. 2025-30 పాలసీతో వేగంగా అభివృద్ధి చెందుతోంది.రూ. 22,324 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా దూకుడుగా ముందుకు వెళ్తుంది. చారిత్రక కోటలు, ఆధ్యాత్మిక సర్క్యూట్లు, ఎకో-టూరిజం, జల పర్యాటకంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తోంది.

11 కోటలకు కొత్త రూపు ఇవ్వాలని పర్యాటక శాఖ ప్రణాళిక

తెలంగాణా రాష్ట్రంలో చారిత్రక కట్టడాల పరిరక్షణకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పర్యాటకంగా తెలంగాణా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను అభివృద్ధి చెయ్యాలని సంకల్పించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చారిత్రక కోటలను పరిరక్షించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. భువనగిరి నుంచి రాచకొండ, దేవరకొండ వరకు ఉన్న 11 కోటలకు కొత్త రూపు ఇవ్వాలని పర్యాటక శాఖ ప్రణాళిక రూపొందించింది

Telangana forts development govt invites private investment under PPP model to develop and restore 11 historic forts

కోటల పరిరక్షణ, అభివృద్ధి, కోసం ప్రైవేట్ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ

ఇందుకోసం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తోంది. భువనగిరి, దేవరకొండ, రాచకొండ, మెదక్, ఖమ్మం, కౌలాస్, జాఫర్‌గఢ్, ఎల్గండల్, రామగిరి, ఉట్నూర్, సర్వాయి పాపన్న కోటలు ఎంపిక కాగా, పర్యాటక శాఖ ఈ కోటల పరిరక్షణ, అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను కోరింది. ఈ కోటలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనుంది.

రాజస్థాన్ కోటల తరహాలో సందర్శకులకు ప్రత్యేక ఏర్పాట్లు

అయినా ప్రైవేట్ సంస్థలకు కోటలను పూర్తిగా అప్పగించరు. కోటల ప్రధాన భాగం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. చుట్టుపక్కల భూమిలో పర్యాటక సదుపాయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ కోటల తరహాలో సందర్శకులకు ప్రత్యేక అనుభవాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు.ప్రైవేట్ భాగస్వాములు తమ స్వంత కాన్సెప్టులతో ముందుకు రావచ్చు.

కొండా సురేఖ బీజేపీలోకి ఎంట్రీపై తేల్చేసిన ఎంపీ డీకే అరుణ!
కొండా సురేఖ బీజేపీలోకి ఎంట్రీపై తేల్చేసిన ఎంపీ డీకే అరుణ!

స్థానిక ఉపాధి, ఆర్థిక అభివృద్ధి

ప్రతిపాదనల్లో కోట పరిరక్షణ, పెట్టుబడి వివరాలు, ఆదాయ నమూనా, స్థానికుల భాగస్వామ్యం తప్పనిసరి. నిర్దిష్ట కాలం తర్వాత అభివృద్ధి చేసిన సదుపాయాలు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి కానీ వాటి మీద వారికి ఎలాంటి హక్కు ఉండదు. ఈ ప్రణాళిక ద్వారా చారిత్రక వారసత్వం కాపాడుతూనే పర్యాటకం, స్థానిక ఉపాధి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. కోటలు కేవలం చూడడానికి మాత్రమే కాకుండా పూర్తి స్థాయి పర్యాటక గమ్యస్థానాలుగా మారే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+