New Ration Card: కొత్త రేషన్ కార్డులకు మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ..!
తెలంగాణలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రజాపాలన దరఖాస్తుల సందర్భంలో కూడా రేషన్ కార్డులకు దరఖాస్తులు సమర్పించారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం మీ సేవా పోర్టల్ ద్వారా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి చివరిలోపు సమర్పించవచ్చు.
ఇదిలా ఉండగా తెలంగాణలో బోగస్ రేషన్ కార్డుల నిర్మూలనకు గత కొన్ని నెలలుగా కసరత్తు కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఇ-కెవైసీ పూర్తి చేయడానికి గడువును పొడిగించింది. తెలంగాణలో రేషన్ కార్డు ఇ-కేవైసి గడువును జనవరి 31, 2024 వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా రేషన్ కార్డు ఇకేవైసీ చేసుకోకుంటే.. వెంటనే రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి ఇ కేవైసీ చేసుకోవచ్చు.

మీరు మీ దగ్గరలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఆధార్, నంబర్ పాటు రేషన్ కార్డు నంబర్ నమోదు చేసి వేలిముద్రలు సమర్పిస్తే మీ రేషన్ కార్డు కేవైసీ పూర్తవుతుంది.బోగస్ రేషన్ కార్డులను ఎరివేయడమే లక్ష్యంగా రేషన్ కార్డు కేవైసీ ప్రారంభించారు. రేషన్ కార్డుల్లో పేరు ఉంటే చాలు వారి పేరుపై రేషన్ తీసుకుంటున్నారు. చనిపోయినా కూడా వారి పేరు తొలగించకుండా రేషన్ తీసుకుంటున్నారు.
ఈ కేవైసీ చేయడం ద్వారా చాలా మంది పేర్లను తొలగించే అవకాశం ఉంది. అందుకే రేషన్ కార్డు ఇ కేవైసీ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలో డిసెంబర్ 30 నాటికి 70.80 శాతం ఈకేవైసీ పూర్తి అయినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications