వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశంసించిన తెలంగాణా గవర్నర్ తమిళి సై.. రీజన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనమే. కిన్నెర వాయిద్య కళాకారులు మొగులయ్య కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా, ఆయన ఇల్లు కట్టుకోవడానికి జనసేన ముందుకు వచ్చిన క్రమంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన పనిపై తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసలు వెల్లువగా మారాయి. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతానికి చెందిన కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది.

నేనే రోడ్లపైకి వస్తా .. జనసేన కార్యకర్తలపై దాడులను సహించం : పవన్ కళ్యాణ్ అల్టిమేటం !!నేనే రోడ్లపైకి వస్తా .. జనసేన కార్యకర్తలపై దాడులను సహించం : పవన్ కళ్యాణ్ అల్టిమేటం !!

 పవన్ కళ్యాణ్ పేద కళాకారులను ఆదుకోవటం హర్షణీయం : గవర్నర్ తమిళి సై

పవన్ కళ్యాణ్ పేద కళాకారులను ఆదుకోవటం హర్షణీయం : గవర్నర్ తమిళి సై

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య కు ఆర్థిక సహాయం అందించడంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసల జల్లు కురిపించారు. పవన్ చేసిన మంచిపని పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని తమిళిసై పేర్కొన్నారు. మీ సహాయం స్పూర్తిదాయకం అంటూ పేద కళాకారులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న ఉద్దేశాన్ని గవర్నర్ తమిళి సై తన ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యక్తం చేశారు.

 కిన్నెర కళాకారుడికి ఆర్ధిక సహాయం అందించిన పవన్ కళ్యాణ్

కిన్నెర కళాకారుడికి ఆర్ధిక సహాయం అందించిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా కలయికలో రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ ఇంట్రడక్షన్ కు కిన్నెర స్వరాలు అందించిన కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య కు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయాన్ని అందించారు. కిన్నెర కళ ఒక అరుదైన కళ అని మొగులయ్య లాంటి కళాకారులను కాపాడాలని, భావించిన పవన్ కళ్యాణ్ మొగులయ్యకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని తన చేతుల మీదుగా అందించారు. సాంప్రదాయ జానపద కళారూపాలను ప్రజల్లోకి తీసుకు వెళుతున్న కళాకారులకు అవసరమైన మద్దతు అందించడం చాలా అవసరమని పవన్ కళ్యాణ్ ఆ సందర్భంగా స్పష్టం చేశారు.

దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందరి ఫోకస్ అంతరించిపోతున్న జానపద కళారూపాలపై, ఎలాంటి సహకారానికి నోచుకోని ప్రసిద్ధ కళాకారులపై పడుతోంది.

 తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న మొగులయ్య పేరు

తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న మొగులయ్య పేరు

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సహాయం చేయడంతో మొగులయ్య పేరు ఇప్పుడు ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో మార్మోగుతోంది. ఆయనకు సహాయం అందించడానికి, కిన్నెర కళను ముందుకు తీసుకురావడానికి తమ వంతు సహాయం అందించడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. తెలంగాణ మంత్రులు సైతం మొగులయ్యకు సహాయం అందిస్తామని ప్రకటనలు చేసినప్పటికీ, ఎప్పుడు ఏ విధంగా సహాయం అందిస్తారు అన్నదానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన నాయకులు మొగులయ్య కు ఇల్లు కట్టు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Recommended Video

Ys Jagan సర్కార్ కు AP Roads తలనొప్పి.. గ్రౌండ్ రియాలిటీ!! || Oneindia Telugu
ప్రాచీన కళారూపాలను కాపాడాలని, కళాకారులను ఆదుకోవాలని విజ్ఞప్తుల వెల్లువ

ప్రాచీన కళారూపాలను కాపాడాలని, కళాకారులను ఆదుకోవాలని విజ్ఞప్తుల వెల్లువ

తెలుగు రాష్ట్రాలలో గతంలో ప్రాశస్త్యాన్ని పొందిన, తెలుగువారికే సొంతమైన అంతరించిపోతున్న కళా రూపాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ ఆదరణకు నోచుకోని కళాకారులు ఎంతోమంది దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందర్నీ గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని, అరుదైన అంతరించిపోతున్న కళారూపాలను కాపాడాలని ఇప్పుడు కళాకారుల నుండి విజ్ఞప్తి వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మొగులయ్య విషయంలో తీసుకున్న చొరవ, ప్రభుత్వాలు కళాకారుల విషయంలోనూ తీసుకుంటే బాగుంటుందని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.

English summary
Telangana state governor Tamilisai Soundararajan has lauded Janasena chief Pawan Kalyan for providing financial assistance to Kinnera instrumentalist Mogulaiah. She responded it was gratifying to support poor artists financially.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X