ప్రభుత్వ ఉద్యోగులకు భారీ సంక్రాంతి కానుక
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిస్తూ ప్రతి ఉద్యోగికి రూ.1.02 కోట్ల ఉచిత ప్రమాద బీమా కల్పించనున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో సంస్థల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ భారీ బీమా పథకాన్ని, ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు విస్తరించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.14 లక్షల ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు భరోసా లభించనుంది. ఈ పథకం అమలుకు సంబంధించి రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చలు పూర్తి చేసింది. ప్రభుత్వానికి లేదా సంస్థలకు అదనపు ఆర్థిక భారం పడకుండా బ్యాంకుల సహకారంతోనే ఈ బీమా సౌకర్యాన్ని కల్పించనుండటం విశేషం.

ప్రభుత్వ లక్ష్యమిదే..
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, "అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లే ఉద్యోగులను ప్రభుత్వం తన కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. గత ప్రభుత్వ పెండింగ్ బకాయిలను కూడా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తున్నాం. ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేస్తూ, ఎటువంటి అవాంఛనీయ ప్రమాదాలు జరిగినా వారి కుటుంబాలు ఆర్థికంగా వీధిన పడకుండా ఉండాలనే ఈ రూ. 1.02 కోట్ల బీమాను అమలు చేస్తున్నాం." అని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, క్షేత్రస్థాయి విధుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే విద్యుత్, ఇతర శాఖల సిబ్బందికి ఈ నిర్ణయం కొండంత అండగా నిలుస్తుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
కొండెక్కి కూర్చున్న కోడి ధరలు.. కొనలేమంటున్న సామాన్యులు! -
బిగ్ షాక్: ఐదు చలాన్లు దాటితే అంతే సంగతి. మీ లైసెన్స్, ఆర్సీ కట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications