రైతు భరోసా నిధుల జమ ముహూర్తం ఎట్టకేలకు ఖరారు..!!

రైతులకు బిగ్ అప్డేట్. రైతులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా నిధుల జమ పైన కీలక సమాచారం వచ్చింది. యాసంగి పనులు కొనసాగుతున్న వేళ సంక్రాంతికి రైతు భరోసా నిధులు జమ చేసేందుకు తొలుత నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రభుత్వం లో నిధుల విడుదల పైన కసరత్తు చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు రైతు భరోసా నిధుల జమ ముహూర్తం పైన స్పష్టత ఇచ్చారు.

తెలంగాణ రైతులకు ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అందుతోంది. నవంబర్‌లో రబీ సీజన్ మొదలవ్వగా.. ఆ సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇంకా అందించలేదు. రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ముందు నిర్ణయించిన ముహూర్తం మేరకు సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు.

Telangana Govt big update for Farmers over release of Rythu Bharosa funds

ఈ నెల 13వ తేదీ నుంచి నిధుల జమకు ముహూర్తంగా ఖరారు చేసారు. ఈ మేరకు సంక్రాంతి కల్లా నిధులు జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు. అయితే, ఇప్పుడు సంక్రాంతి కి నిధులు విడుదల అవ్వటం కష్టంగానే కనిపిస్తోంది. సంక్రాంతికి నిధులు వస్తాయని భావించిన రైతులకు మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పటం లేదు.

ప్రభుత్వం నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు జనవరి చివరి వారంలో రైతు భరోసా నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీ నుంచి నిధులు రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సారి రైతు భరోసా అమలు లో ప్రభుత్వం కీలక మార్పులు తెస్తోంది. సాగుకు వినియోగంలో ఉన్న భూములకు మాత్రమే భరోసా నిధులు ఇవ్వాలని డిసైడ్ చేసింది. పథకం అమలు, అర్హతపైన కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అయితే, శాటిలైట్ సర్వే వల్ల రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగు తోంది.

శాటిలైట్ సర్వే వివరాలు ఇప్పటికే కంప్యూటర్లలో స్టోర్ అవ్వగా.. వాటిల్లో పంట సాగులో ఉన్న భూములను గుర్తించే ప్రక్రియ షురూ అయింది. ఈ ప్రాసెస్ పూర్తవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. జనవరి 26 నుంచి రైతుల అకౌంట్లో ఎకరానికి రూ 6 వేలు చొప్పున నిధులు జమ చేయనున్నారు. జనవరి 26 నుంచి మొదలుకానున్న రైతు భరోసా నిధుల ప్రక్రియ 10 రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+