ధాన్యం కొనుగోలు వేళ..వారికి శుభవార్త.. ఆ నగదు ఖాతాల్లో!
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధాన్యం కొనగలు కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయి నిధులను విడుదల చేసింది . రెండు సీజన్లకు సంబంధించిన నిధులను విడుదల చేసి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వడ్ల కొనుగోలు సంఘాల కమీషన్ నిధుల విడుదల
వడ్ల కొనుగోలు కీలక పాత్ర పోషిస్తున్న పలు కేంద్రాలకు సంబంధించిన 2023- 24 ఆర్థిక సంవత్సరం యాసంగి, వానకాలం రెండు సీజన్లకు సంబంధించిన బకాయి ఉన్న కమిషన్ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు నుంచి వడ్లను కొనుగోలు చేయడానికి ప్రతి సంవత్సరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ
ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చూడడం కోసం, అలాగే రైతులకు నష్టం జరగకుండా చూడడం కోసం ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తుంది. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, ఎఫ్ పి ఓ లు, ఐకెపి, పిఎసిఎస్ కమిటీలు ప్రతి సీజన్లో రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయి.
ధాన్యం కొనుగోలు కమిటీలకు ప్రభుత్వ కమీషన్
50 శాతానికి పైగా వడ్ల కొనుగోలు ప్రస్తుతం ఐకెపి కేంద్రాలలో జరుగుతుండగా, మిగిలిన వడ్లను మార్కెట్ కమిటీలు, పిఎసిఎస్, ఎఫ్ పి ఓ ల ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తున్న సంఘాలకు క్వింటాలకు 32 రూపాయలు చొప్పున కమిషన్ చెల్లిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో కమిషన్ల రూపంలో భారీ మొత్తం ప్రభుత్వం నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
కమీషన్ విడుదల చేస్తున్న ప్రభుత్వం
ఇక వడ్లు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణతో మహిళా సంఘాలు, పిఎసిఎస్ లు, ఎఫ్ పి ఓ లు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి. యాదాద్రి భువనగిరిలో 2023 - 24 వానకాలం, యాసంగిలో కొన్న వడ్ల తాలూకు కమిషన్ ను ప్రభుత్వం ఆయా సంఘాలకు ఇవ్వవలసి ఉంది. ఇందులో భాగంగా తొలి విడతలో భాగంగా 12 కోట్ల 67 లక్షల 47 వేల రూపాయలను ఆరు నెలల క్రితం ప్రభుత్వం విడుదల చేసింది.
తాజాగా ఆ నిధులు ఇస్తూ ఉత్తర్వులు
తాజాగా 5, 66,85370 రూపాయల కమిషన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది మళ్ళీ ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించే క్రమంలో పెండింగ్ బకాయిలను విడుదల చేయడం శుభవార్త.












Click it and Unblock the Notifications