తెలంగాణలో కొత్త పథకం: ఎదురు చూపులకు తెర: రేపటి నుంచి నమోదు

Rajiv Yuva Vikasam: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సహయాన్ని అందించడానికి ఉద్దేశించిన పథకం ఇది.

దీని పేరు- రాజీవ్ యువ వికాసం. వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధిని కల్పించడానికి ఈ పథకానికి రూపకల్పన చేసింది రేవంత్ సర్కార్. దీనికింద నిరుద్యోగ యువతకు మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా అయిదు లక్షలమందికి లబ్ది కలుగుతుంది.

రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం అంటే 17వ తేదీన ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (OBMMS) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Rajiv Yuva Vikasam

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం 3 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనుంది. ఇందులో 60 శాతం నుంచి 80 శాతం వరకు రాయితీ లభిస్తుంది. దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల మేర ఈ రుణాలను అందించనుంది.

పూర్తి వివరాల కోసం https://tgobmms.cgg.gov.in/ ను దర్శించవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 5వ తేదీన ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 6 నుంచి మే 31వ తేదీ వరకు వాటిని సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. వాటిని వడపోస్తారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు.

ఈ స్కీమ్​కు ఎంపికైన లబ్దిదారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2వ తేదీన రుణ మంజూరు పత్రాలు ప్రభుత్వం అందజేస్తుంది. దీనికోసం మండల స్థాయిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేయనుంది. ఏ జిల్లాకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఆ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ కొనసాగుతుంది. లబ్ధిదారుల తుది జాబితాను ​ప్రకటిస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా అయిదు లక్షల మందికి రాజీవ్​ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తే- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ఏజెన్సీ ప్రాంతాలవాళ్లు ఐటీడీఏ అధికారులను సంప్రదించాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+