తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలకు బిగ్ షాక్..! కమిటీ కోర్టులోనే బంతి..!
తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలకు ఇవాళ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు కోసం కాలేజీలు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు కోసం ఇప్పటికే వచ్చిన విజ్ఞప్తులపై ప్రభుత్వం నియమించిన కమిటీయే తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తేల్చిచెప్పేసింది. దీంతో ఈ ఏడాది ఫీజుల పెంపుపై ఆయా కాలేజీలకు షాక్ తగిలినట్లయింది.
తెలంగాణలో అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల విషయంలో తాత్సారం చేయడంపై నిన్న హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతీ ఏటా ఇదే తంతు సర్వసాధారణం అయిపోయిందంటూ ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన ఫీజుల పెంపు పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుకు అనుమతివ్వాలని కోరుతూ మొత్తం 11 యాజమాన్యాలు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు..మూడేళ్లకోసారి కాలేజీల్ని పరిశీలించి ఫీజుల పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వ కమిటీ నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కమిటీపై కాలేజీలు ఒత్తిడి చేయకుండా మౌనంగా ఉండిపోయి కౌన్సెలింగ్ ముగిశాక ఇలా పిటిషన్లు వేయడమేంటని ప్రశ్నించింది.
అయితే కాలేజీలు ఇచ్చిన ప్రతిపాదనలు 5 వేల పేజీలు ఉన్నాయని, వీటిని పరిశీలించేందుకు సమయం కావాలన్నారు. దీంతో విచారణ ముగించిన హైకోర్టు.. కమిటీ వద్దే తేల్చుకోవాలని ఇంజనీరింగ్ కాలేజీలకు స్పష్టం చేసింది. దీంతో కాలేజీలు ఇప్పుడు తిరిగి కమిటీని ఆశ్రయించేందుకు సిద్దమయ్యాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications