TS Inter Exams: ఆన్ లైన్ లో ఇంటర్ హాల్ టికెట్లు.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..!
తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు సంబంధింత కాలేజీలకు పంపారు. ఇంటర్ హాల్ టికెట్లను ఆన్ లైన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ESSSC నంబర్ తో హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. సెకండ్ ఇయర్ వారు మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్ తో హాల్ టికెట్ నంబర్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే https://tsbie.cgg.gov.in వెబ్ సైట్ కు వెళ్లాలి. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకుని ఏమైన తప్పులు ఉంటే కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. అయితే ఆన్ లైన్ లో హాల్ టికెట్లు పెడతామని ప్రటించినప్పటికీ ఇప్పటి వరకు హాల్ టికెట్లు అందుబాటులో లేవు. పరీక్షలకు ఇంకా 6 రోజులు మాత్రమే గడువు ఉంది. దీనిపై ఇంటర్ బోర్డును సంప్రదించగా త్వరలోనే ఆన్ లైన్ హాల్ టికెట్లు పెడతామని చెప్పారు.

మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవ్వనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 28న (సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1), మార్చి 1న1 (ఇంగ్లీష్ పేపర్-1),మార్చి 4న (గణితం పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1), మార్చి 6న (మ్యాథమెటిక్స్ 1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1), మార్చి 11న (ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1), మార్చి 13న (కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
మార్చి 15న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బైపీసీ విద్యార్థల కోసం బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1 ఉంటుంది. మార్చి 18న (మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1) ఉండనుంది.
రెండో సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 29న(సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2), మార్చి 2న (ఇంగ్లీష్ పేపర్-2), మార్చి 5న(గణితం పేపర్ 2A, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2), మార్చి 7న (మ్యాథమెటిక్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2), మార్చి 12న (ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2) మార్చి 14న (కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2), మార్చి 16న (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-2 బైపీ విద్యార్థుల కోసం), మార్చి 19న (మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2) నిర్వహించనున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications