TG ఇంటర్ ఫలితాల ప్రకటన - వాట్సాప్ లో రిజల్ట్స్.. ఇలా చెక్ చేయండి..!!
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేశవ రావు ఫలితాలను ప్రకటించారు. ఈ సారి ఫలితాలను సులభంగా తెలుసుకునేందుకు విద్యార్ధులకు కొత్త విధానం అందబాటులోకి తీసుకొచ్చారు. వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయటం ద్వారా వెంటనే ఫలితాలు తెలిసే విధంగా అవకాశం కల్పించారు. ఇంటర్ ఫలితాల్లో 70.58 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఆత్రతుగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదల అయ్యాయి. సెకండ్ ఇయర్ లో 78.65 శాతం మంది ఉత్తీర్ణ సాధించారు. ప్రధమ సంవత్సరంలో 66.02 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం కంటే బాలికల శాతం ఎక్కువగా ఉంది.ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 9.9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు అయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు 5,07,949 మంది ఉన్నారు. అయితే గతంలో జరిగిన తప్పులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఫలితాల విడుదల విషయంలో ఇంటర్ బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకుంది.

పరీక్ష మార్కుల లెక్కింపులో ఎలాంటి తేడాలు జరగకుండా ఒకటి రెండు సార్లు మూల్యాంకనం చేసింది. అయితే కేవలం ఒకటి రెండు మార్కుల దగ్గర, ఒక్క పేపర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రీ-వాల్యూయేషన్ చేసారు. ఈ సారి ఫలితాలను వాట్సప్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేసారు. గతంలో ఇదే విధానంలో హాల్ టికెట్లు విజయవంతంగా పంపిణీ చేయగా, ఇప్పుడు ఫలితాలను కూడా ఇదే రకంగా వాట్సప్ ద్వారా అందిస్తున్నారు.
విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసి 'Hi' అని మెసేజ్ పంపాలి. అనంతరం మెనూలో "BIE Exam Result" ఎంపికను ఎంచుకుని, హాల్ టికెట్ నంబర్, సంవత్సరం (1వ సంవత్సరం/2వ సంవత్సరం), స్ట్రీమ్ (General/Vocational) వివరాలను నమోదు చేయాలి. వివరాలు సమర్పించిన వెంటనే ఫలితాలు మెసేజ్ రూపంలో ప్రత్యక్షమవుతాయి.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications