Telangana Formation Day: ఆవిర్భావ వేడుకలకు సిద్ధమైన తెలంగాణ..
రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకునేందుకు తెలంగాణ సిద్ధమైంది. రాష్ట్రం వచ్చి పదేళ్లు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రజలు సిద్ధమయ్యారు. తెలంగాణ అంతటా ఘనంగా వేడుకలు నిర్వహించుకోనున్నారు.
ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అమరవీరలకు నివాళులు అర్పించనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని సీఎం, మంత్రులు నివాళులు అర్పిస్తారు. అక్కడ నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్ వెళ్తారు. ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గౌరవ వందన స్వీకరించిన తర్వాత అందెశ్రీ రచించిన తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు.

ఆ తర్వాత సోనియా గాంధీ వీడియో సందేశం వినిపిస్తారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఏం చేశారనే అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రసంగంలో వివరించనున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6.30కు ట్యాంక్ బండ్ కు చేరుకుంటారు. స్టాళ్లను సందర్శిస్తారు.












Click it and Unblock the Notifications