డాక్టర్‌ను ఆరోగ్యమంత్రిని చేయండి: రేవంత్ రెడ్డికి అందిన మొట్ట మొదటి విజ్ఞప్తి

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్నాయి. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలను ఆమె జారీ చేశారు.

Telangana Junior Doctors Association urged for a Doctor as Health Minister

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో- ఇక మంత్రివర్గ కూర్పుపై కసరత్తు సాగుతోంది. మంత్రుల జాబితాతో రేవంత్.. ఢిల్లీ వెళ్లారు. ఈ జాబితాపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదముద్ర వేయాల్సి ఉంది. దీనిపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వద్ద చర్చించాల్సి ఉంది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ జూనియర్ డాక్టర్ల నుంచి మొట్టమొదటి విజ్ఞప్తి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందింది. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని విడుదల చేసింది. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన డాక్టర్లందరినీ అభినందిస్తూనే.. తమ కోరికను బయటపెట్టింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన డాక్టర్ వంశీకృష్ణ- అచ్చంపేట్, డాక్టర్ రామ్‌చందర్ నాయక్- డోర్నకల్, డాక్టర్ మురళీ నాయక్- మహబూబాబాద్, డాక్టర్ సత్యనారాయణ- మానకొండూర్, డాక్టర్ మైనంపల్లి రోహిత్- మెదక్, డాక్టర్ పర్ణికా రెడ్డి- నారాయణపేట్, డాక్టర్ సంజీవరెడ్డి- నారాయణఖేడ్, డాక్టర్ వివేక్ వెంకటస్వామి- చెన్నూర్, డాక్టర్ భూపతిరెడ్డి- నిజామాబాద్, డాక్టర్ రంగమయి- సత్తుపల్లి, డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి- నాగర్ కర్నూల్, డాక్టర్ పాల్వాయి హరీష్- సిర్పూర్, డాక్టర్ తెల్లం వెంకట్రావ్- భద్రాచలం, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్- కోరుట్ల రూరల్, డాక్టర్ సంజయ్- జగిత్యాల్‌ను అభినందించింది.

వేర్వేరు పార్టీల నుంచి ఇంతమంది డాక్టర్లు అసెంబ్లీకి ఎన్నిక కావడం శుభపరిణామం అని, భవిష్యత్తులో తెలంగాణలో వైద్య, ఆరోగ్యరంగం మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. వైద్య విధానాలను రూపొందించడంలో డాక్టర్ల సూచనలు తప్పకుండా సహాయపడతాయని వ్యాఖ్యానించింది. వైద్య వ్యవస్థ ఎలా ఉండాలనే విషయంపై డాక్టర్లకే సమగ్రమైన అవగాహన ఉంటుందని పేర్కొంది.

రోగుల అవసరాలు, ఆసుపత్రులు, పరికరాలు, మందులు, వైద్య- ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన.. వంటి అంశాలపై డాక్టర్ ఎమ్మెల్యేల సూచనలను కొత్త ప్రభుత్వం స్వీకరించాలని కోరింది. అలాగే కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో- ఓ డాక్టర్‌ను ఆరోగ్య మంత్రిగా నియమించాలని విజ్ఞప్తి చేసింది తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+