కువైట్ ఎడారిలో ఒంటెల కాపరిగా.. ది గోట్ లైఫ్ స్టోరీ రిపీట్

ది గోట్ లైఫ్.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఎందుకు ఉన్న ఊళ్ళను వదిలిపెట్టుకొని పరాయి దేశాలకు వెళ్లి పడరాని పాట్లు పడతారు అనే భావన కలుగుతుంది. సుఖంగా, ప్రశాంతంగా జీవించే ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచనతో సౌదీ వెళితే అక్కడ ఎడారిలో గొర్రెలు, ఒంటెల కాపరిగా మారి దుర్భరజీవితాన్ని గడిపిన ఉదంతం సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లో ఎంతోమంది అనుభవిస్తున్నారు.

కువైట్ ఎడారిలో ఒంటెల కాపరిగా
ప్రస్తుతం అటువంటి ఒక వ్యక్తి తనను కాపాడాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, భారత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. కువైట్ ఎడారిలో ఒంటెల కాపలాలో మగ్గిపోతున్న తనను రక్షించాలని తెలంగాణకు చెందిన వలస కార్మికుడు రాథోడ్ నాందేవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇతను ఒక వీడియో సందేశంలో ఢిల్లీకి చెందిన రిక్రూటింగ్ కంపెనీ హౌస్ కీపర్ వీసా పైన కువైట్ కి పంపిందని పేర్కొన్నారు.

Telangana migrant laborer As a camel herder in the Kuwait desert The Goat Life Story Repeat

తెలంగాణా వాసి దుర్భర పరిస్థితి
అయితే అక్కడికి వెళ్లిన తర్వాత కఠినమైన ఎడారి వాతావరణంలో ఒంటెల కాపరిగా పనిచేయాల్సి వస్తుందని, ఇక్కడి నుంచి బయటపడే మార్గం తనుకు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన నాందేవ్ ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచనతో కువైట్ కి వెళ్ళగా అక్కడ అతను ఒంటెల కాపరిగా దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుందని అతని వీడియో అభ్యర్థనలో అర్థమవుతుంది.

సహాయం కావాలని అభ్యర్ధన
జులై 2024 లో గడువు ముగిసిన అతని పాస్పోర్ట్ కూడా అతని వీడియో అభ్యర్థనతో పాటు ఆన్లైన్లో కనిపించడంతో అతని పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని అర్థమవుతుంది. ఈ వీడియోలో తన బ్రతుకు మీద నిరాశను వ్యక్తం చేస్తున్న నాందేవ్ భారతదేశానికి తిరిగి రావడానికి తక్షణ సహాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశాడు.

అమానవీయ పరిస్థితులలో ఎడారుల్లో బానిసలుగా వలస కార్మికులు
అతని కుటుంబ సభ్యులు, స్థానిక అధికారులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తనను సురక్షితంగా తీసుకురావాలని కోరాడు. భారతీయ వలస కార్మికుల విదేశాలలో చిక్కుకు పోతున్నారని, విదేశాలలో బానిసలుగా పని చేయాల్సి వస్తుందని, వారు తరచూ అమానవీయమైన పని పరిస్థితులను ఎదుర్కొంటూ, దుర్భర జీవితాలను గడపాల్సి వస్తుందని తన వీడియో సందేశం ద్వారా తెలిపాడు. మరి ఈ వలస కార్మికుడిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపుతోందా? ఇతని పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+