బాబుతోనే డబ్బు రాజకీయాలు: తలసాని, కాంగ్రెస్, కిషన్ రెడ్డిపై హరీశ్ ఫైర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో డబ్బు రాజకీయాలు పుట్టించింది తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో భవనాల క్రమబద్దీకరణపై చర్చించడానికి నగర మంత్రులు, అధికారుల మంగళవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. 20, 30 ఏళ్లుగా హైదరాబాద్‌లో విచ్చలవిడిగా లేఅవుట్లకు అనుమతులు ఇచ్చారన్నారని ఆరోపించారు. 111 జీవో, అటవీ, చెరువుల అక్రమణల విషయంలో రాజీపడబోమని చెప్పారు. ఇలాంటి భూముల్లో పేదలు ఉంటే పునరావాసం కల్పిస్తామన్నారు.
కాంగ్రెసోళ్లకు ముంచుడు తెలుసు, కిషన్ నువ్వు ఏ వైపు?: హరీశ్
వరంగల్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు దళారుల పక్షాన పనిచేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెసోళ్ల కోసమో, దళారుల కోసమో ప్రాజెక్టులు కట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెసోళ్లకు ముంచుడు తప్ప ఏమీ తెలియదని మండిపడ్డారు.
తోటపల్లి ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి హారీశ్‌రావు మంగళవారం వివరణ ఇచ్చారు.
ప్రస్తుత డిజైన్‌తో తోటపల్లి ప్రాజెక్టు కడితే 6 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఈ ముంపు గ్రామాల్లో దళారులు కొత్తగా కట్టిన కొట్టాల కోసం కాంగ్రెస్ నాయకులు కొట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటపల్లి ప్రాజెక్టును రిడిజైన్ చేస్తే ఎకరం మునగకుండా 40 వేల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చని వివరించారు.

కాంగ్రెస్, బిజెపి నేతలు కళ్లులేని కబోదుళ్లా వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను ముంచే పోలవరానికి నిధులిస్తున్న కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం రూపాయి విదల్చడం లేదని విమర్శించారు.
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే చంద్రబాబుతో బీజేపీ అంటకాగుతున్నదని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకుంటున్న చంద్రబాబుకు కిషన్‌రెడ్డి ఎలా మద్దతు ఇస్తాడని ప్రశ్నించారు. ఆంధ్రా నేతల చేతిలో కిషన్‌రెడ్డి కీలుబొమ్మలా మారాడని ఎద్దేవా చేశారు.
పాలమూరు, డిండి ఎత్తిపోతల కట్టాలా వద్దా కిషన్‌రెడ్డి స్పష్టం చేయాలన్నారు.
కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రజల పక్షాన ఉంటారా... చంద్రబాబు పంచన చేర్తారో తేల్చుకోవాలన్నారు. కిషన్‌రెడ్డి ధర్నా చేయాల్సింది వరంగల్‌లో కాదు, ఢిల్లీలో చేయాలని సూచించారు. బీజేపీ నుంచి నేతలందరూ ఎందుకు బయటకు పోతున్నారో కిషన్‌రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications